Shoaib Akhtar: బీసీసీఐపై విషం చిమ్మిన షోయబ్ అక్తర్

లాహోర్: బీసీసీఐపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar ) మరోసారి విషాన్ని చిమ్మాడు. భారత క్రికెట్ బోర్డు వల్లే ఐసిసి పురుషుల టీ20 ప్రపంచ కప్ వాయిదా ( ICC Mens T20 World Cup )  పడిందని ఆరోపించిన షోయబ్ అక్తర్... ఐపిఎల్ 2020 ( IPL 2020 ) కోసమే బీసీసీఐ ఈ పని చేసిందని అన్నాడు.

Last Updated : Jul 23, 2020, 07:59 PM IST
Shoaib Akhtar: బీసీసీఐపై విషం చిమ్మిన షోయబ్ అక్తర్

లాహోర్: బీసీసీఐపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar ) మరోసారి విషాన్ని చిమ్మాడు. భారత క్రికెట్ బోర్డు వల్లే ఐసిసి పురుషుల టీ20 ప్రపంచ కప్ వాయిదా ( ICC Mens T20 World Cup )  పడిందని ఆరోపించిన షోయబ్ అక్తర్... ఐపిఎల్ 2020 ( IPL 2020 ) కోసమే బీసీసీఐ ఈ పని చేసిందని అన్నాడు. బీసీసీఐకి ప్రపంచ కప్ 2020 ఏమై పోయినా పర్వాలేదని.. వాళ్ల ఐపీఎల్ 2020 టోర్నమెంట్ మాత్రం ఆగకూడదు అని షోయబ్ ఎద్దేవా చేశాడు. ఐసిసి మెన్స్ టీ 20 వరల్డ్ కప్ వాయిదా పడటంలో బీసీసీఐ ( BCCI ) పాత్ర ఎంతైనా ఉందన్న షోయబ్ అక్తర్.. ఐపిఎల్ 2020 నిర్వహణ కోసమే బీసీసీఐ ఇలా వ్యవహరించిందని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని తాను ముందు నుంచే చెబుతూ వస్తున్నానంటూ బిసిసిఐపై అక్తర్ విరుచుకుపడ్డాడు.  

 ( Also read: IPL 2020 : అబు దాబిలో ఐపిఎల్‌కి ఏర్పాట్లు )

ఆసియా కప్ ( Asia Cup 2020 ) కూడా జరిగి ఉండేది. ఒకవేళ ఆసియా కప్ జరిగి ఉంటే, భారత్, పాకిస్తాన్ జట్లు ( Ind vs Pak ) మైదానంలో తలపడటానికి ఇది ఓ చక్కటి అవకాశంగా ఉండేది. కాకపోతే ఆసియా కప్ జరగకపోవడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. అవన్నీ ప్రస్తావించడం ఇప్పుడు తనకు ఇష్టం లేదు అని అక్తర్ వ్యాఖ్యానించాడు. జియో క్రికెట్ అనే యూట్యూబ్ ఛానెల్‌కి ( Geo cricket youtube channel ) ఇచ్చిన ఇంటర్వ్యూలో షోయబ్ అక్తర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ( Also read: Sourav Ganguly: త్వరలో తేలనున్న గంగూలీ భవితవ్యం.. IPL టైమ్‌లో చిక్కులు )

బీసీసీఐపై ఈ ఆరోపణలతో సరిపెట్టుకోని షోయబ్ అక్తర్.. 2008 నాటి మంకీగేట్ ( Monkeygate ) వివాదాన్ని సైతం మరోసారి ప్రస్తావించాడు. ఈ వివాదం అనంతరం ఆసిస్‌తో సిరీస్ ముగించుకుంటామని భారత్ చెప్పడం ఏంటి, అలాంటిదేమీ జరగలేదు అని చెప్పడానికి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు విలువలు ఏమయ్యాయంటూ ఆసిస్, భారత్‌పై షోయబ్ అక్తర్ అవాకులు చెవాకులు పేలాడు.  IPL 2020: యూఏఈలోనే ఐపీఎల్ 2020.. 3 వేదికలు

Trending News