Dhawan-Ayesha Mukherjee Divorce: ధావన్‌కు బిగ్ రిలీజ్.. భార్యతో విడాకులు మంజూరు

భారత క్రికెటర్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ ధావన్ కు ఢిల్లీలోని పాటియాలా హౌస్ లోని ఫ్యామిలీ కోర్టు భార్య అయేషా నుండి విడాకులు మంజూరు అయ్యాయి. అయేషా వలన ధావన్ మానసిక వేదనకు దురయ్యాడన్న ఆరోపణలకు కోర్టు ఆమోదించి.. విడాకులు మంజూరు చేసింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 5, 2023, 01:00 PM IST
Dhawan-Ayesha Mukherjee Divorce: ధావన్‌కు బిగ్ రిలీజ్.. భార్యతో విడాకులు మంజూరు

Dhawan-Ayesha Mukherjee Divorce: భారత్ క్రికెటర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు బుధవారం రోజున విడాకులు మంజూరయ్యాయి. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కాంప్లెక్స్‌లోని ఫ్యామిలీ కోర్టు తన మాజీ భార్య అయేషా వలన ధావన్ మానసిక వేదన గురయ్యారని ఆరోపణలకు కోర్టు విడాకులు మంజూరు చేసింది.  

శిఖర్ ధావన్ మరియు అయేషా ముఖర్జీలు 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. గత కొంత కాలంగా శిఖర్ ధావన్ - అయేషా ముఖర్జీ దూరంగా ఉంటున్న సందడి తెలిసిందే! ధావన్ - అయేషా విడాకుల విషయం స్వయంగా అయేషా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంట్లో భాగంగా ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో తన భార్య తనను మానసిగా వేధిస్తోందని ధావన్ విడాకుల పిటిషన్‌ ధాఖలు చేశాడు. 

ఈ కేసు విచారణకు రాగా.. న్యాయమూర్తి హరీష్ కుమార్ అయేషా పై ధావన్ చేసిన ఆరోపణలన్ని నిజాలనేని అంగీకరించారు. అయేషా చేసిన ఒత్తిడి వలన ధావన్ మానసిక వేదనకు గురయ్యాడన్న ఆరోపణలను న్యాయమూర్తి అంగీకరించారు. 

ధావన్ కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆస్తులలోని 3 ఆస్తులలో 99 శాతం అయేషాకి ఇవ్వాలని ధావన్ చేసిన ఆరోపణలను మరియు ధావన్‌ తన కుమారుడిని కూడాకలవటానికి కూడా నిరాకరించిందన్న ఆరోపణలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. ధావన్ తన కుమారుడిని ఆస్ట్రేలియా లేదా ఇండియాలో కలవటానికి న్యాయస్థానం అనుమతినిచ్చింది. అంతేకాకుండా ఎపుడైనా సరే ధావన్ తన కుమారుడితో వీడియో కాల్ మాట్లాడవచ్చని కోర్టు తెలిపింది. కానీ ధావన్ కుమారుడి కస్టడీ గురించి కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. 

Also Read: Eng Vs NZ Match Upadates: నేడే విశ్వకప్ ఆరంభం.. తొలి మ్యాచ్‌కు ముందు రెండు జట్లకు షాక్  

2012 లో అయేషా- ధావన్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ధావన్ తో పెళ్ళికి ముందే అయేషాకి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ధావన్ తో.. అయేషాకి రెండో పెళ్లికాగా.. ధావన్- అయేషా దంపతులకు జొరావర్‌ అనే 9 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ధావన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. ముందుగా తానే అయేషాకి ప్రపోస్ చేసినట్టు తెలిపాడు. 2021 లాక్ డౌన్ సమయంలో అయేషా-కుమారుడితో కలిసి ధావన్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం అవి వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే!

Also Read: World Cup 2023: ప్రపంచకప్ 2023లో టీమ్ ఇండియా మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడు, ఎవరితో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News