Team India bowling coach: టీమిండియా కొత్త బౌలింగ్​ కోచ్​గా అజిత్ అగార్కర్​?

ICC ODI WC 2023: భారత జట్టు బౌలింగ్ కోచ్ ను మార్చనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. కొత్త బౌలింగ్ కోచ్​గా అజిత్ అగార్కర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2022, 06:36 PM IST
Team India bowling coach: టీమిండియా కొత్త బౌలింగ్​ కోచ్​గా అజిత్ అగార్కర్​?

Team India new bowling coach: టీ20 వరల్డ్ కప్ 2021 ముగిసిన తర్వాత భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. హెడ్ కోచ్ రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) వచ్చాడు. అలాగే బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ స్థానంలో మాంబ్రే బాధ్యతలు చేపట్టాడు. సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. తాజాగా కొత్త బౌలింగ్ కోచ్ వస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) ఈ బాధ్యతను చేపట్టనున్నట్లు వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. 

ప్రస్తుతం టీమిండియా బౌలింగ్  కోచ్​గా పరాస్​ మాంబ్రే (Paras Mhambrey) ఉన్నాడు. అతని సేవలపై సంతృప్తిగా లేని భారత జట్టులోని ఓ సీనియర్ ఆటగాడు అగార్కర్ పేరును బోర్డుకు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. వన్డే ప్రపంచకప్​-2023 ( 2023 ODI World Cup) సన్నాహాల్లో భాగంగా... అగార్కర్​ వంటి అనుభవజ్ఞుడు భారత జట్టు బౌలింగ్ కోచ్ గా ఉంటే బాగుంటుందని ఆ సీనియర్ ఆటగాడు బావిస్తున్నాడు. మాంబ్రే మంచి బౌలింగ్ కోచ్ అని... అతడు భారత-ఎ, అండర్​ 19 ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో నిమగ్నమై ఉంటే.. అగార్కర్​ సీనియర్లను చూసుకుంటాడు అంటూ ఆ క్రికెటర్ వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

టీమిండియా తరపున మాంబ్రే 2 టెస్టులు, 3 వన్డేలు ఆడాడు. అంతేకాకుండా భారత-ఎ, అండర్​ 19 జట్లకు బౌలింగ్ కోచ్ గా పనిచేశాడు. మరోవైపు, అగార్కర్..బీసీసీఐ చీఫ్​ సెలక్టర్​ పదవికి పోటీ చేసి ఓడిపోయాడు. తన 10 సంవత్సరాల కెరీర్‌లో అగార్కర్  28 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20 మ్యాచ్​లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో మొత్తం 349 వికెట్లు తీసుకున్నాడు. 44 ఏళ్ల అతను చివరిసారిగా 2013లో ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అప్పటి నుంచి టీవీ వ్యాఖ్యాతగా బాధ్యతలు చేపట్టారు.

Also Read: Team India Cricketer Retirement: టీమిండియా క్రికెటర్ రిటైర్‌మెంట్.. అన్ని ఫార్మాట్లకు గుడ్‌ బై..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News