కోహ్లీ ఫిట్నెస్ రహస్యం ఇదిగో!

Last Updated : Nov 7, 2017, 01:09 PM IST
కోహ్లీ ఫిట్నెస్ రహస్యం ఇదిగో!

భారత క్రికెటర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో, టీ20 మ్యాచుల్లో దూసుకెళ్తూ రికార్డులు సృష్టింస్తున్న  విషయం అందరికీ తెలిసిందే.! అందుకు కారణం అతని ఫిట్నెస్. డాషింగ్ బ్యాట్స్ మెన్ గా దూసుకెళ్తున్న కోహ్లీ అంత  ఫిట్ గా ఉండటానికి ఏం చేస్తారు? ఏం తింటారు? అని అభిమానులు కూడా తెలుసుకోవాలని ఆరాట పడుతుంటారు. 

గంటల తరబడి జిమ్ లో ఉండి వ్యాయామం చేయడమే తన ఫిట్నెస్ కు కారణం కాదు అని విరాట్ ఒకసారి అన్నారు. నా ఫిట్నెస్ కు కారణం నా ఆహారపు అలవాట్లు కూడా అని మొన్నీమధ్య "బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్"వెబ్ సిరీస్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు. తన ఆహార అలవాట్ల గురించి కోహ్లీ ఈ ఇంటర్వూ లో చెప్పుకున్నారు. అతని మాటల్లోనే విందాం ఏమి చెప్పారో!!

* ఉదయాన్నే మెను గుడ్డు ఆమ్లెట్ తో మొదలవుతుంది. మూడు ఎగ్  వైట్లు, ఒక ఫుల్ ఎగ్ తో ఆమ్లెట్ తీసుకుంటాను.  

* పాలకూర, బ్లాక్ పెప్పర్, వెన్న ఆహారంలో చేర్చుకుంటాను. 

* బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, పుచ్చకాయ ముక్కల్ని తింటాను. 

* ఆతరువాత గ్రీన్ టీ తో నా బ్రేక్ ఫాస్ట్ ముగుస్తుంది, 

* లంచ్ లైట్ గా తీసుకుంటాను. మధ్యాహ్నం లంచ్ లో గ్రిల్డ్ చికెన్, ఉడికించిన బంగాళాదుంపలు, పాలకూర, కాయగూరలు తింటాను. 

* డిన్నర్ ను సీ ఫుడ్ తో  ముగిస్తాను. 

ఇవన్నీ డాక్టర్ల సలహా మేరకే పాటిస్తున్నట్లు కోహ్లీ చెప్పారు. 

Trending News