India vs West Indies: ఆలస్యంగా ప్రారంభంకానున్న రెండో టీ20 మ్యాచ్‌..కారణం అదే..!

India vs West Indies: విండీస్ గడ్డపై టీమిండియా జోరు కొనసాగుతోంది. ఇవాళ రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది.

Written by - Alla Swamy | Last Updated : Aug 1, 2022, 07:32 PM IST
  • విండీస్‌లో భారత జట్టు
  • కాసేపట్లో రెండో మ్యాచ్
  • రేపే మూడో టీ20
India vs West Indies: ఆలస్యంగా ప్రారంభంకానున్న రెండో టీ20 మ్యాచ్‌..కారణం అదే..!

India vs West Indies: భారత్, విండీస్ మధ్య జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభమవుతున్నట్లు విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కొన్ని కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తొలి టీ20 జరిగిన ట్రినిడాడ్ మైదానం నుంచి జట్లకు సంబంధించిన లగేజ్‌ రావడం ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగా మ్యాచ్‌ను మరో రెండు గంటల ఆలస్యంగా మొదలు పెట్టనున్నట్లు సమాచారం అందుతోంది. 

రెండో టీ20 మ్యాచ్‌ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ మొదలు కానుంది. ఐతే ఇప్పుడు రెండో టీ20 మ్యాచ్‌ రాత్రి 10 గంటలకు ప్రారంభంకానుందని విండీస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇవాళ, రేపు వరుసగా రెండు, మూడు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత అమెరికాకు టీమిండియా వెళ్లనుంది. అక్కడే రెండు టీ20 ఆడనుంది.

Also read:Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్..హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ..!

Also read:MP Fire Accident: మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో అగ్నికీలలు..పలువురు సజీవ దహనం..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News