India batter Sanju Samson will play for Ireland: భారత జట్టులో అన్యాయానికి గురైన క్రికెటర్ ఎవరంటే?.. సగటు క్రికెట్ అభిమాని టక్కున చెప్పే పేరు సంజూ శాంసన్. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ.. సరైన అవకాశాలు లేక బెంచ్‌కే పరిమితమవుతూ వస్తున్నాడు. జట్టులో ఏ ప్లేయర్‌కు అవకాశం ఇవ్వాలన్నా.. సంజూనే ముందుగా బలవవుతాడు. ఐపీఎల్‌లో రాణించిన ఎంతోమంది ప్రస్తుతం భారత జట్టులో ఆడుతున్నారు. గత 2-3 సంవత్సరాలుగా నిలకడైన ప్రదర్శన చేస్తున్నా.. సంజూకి మాత్రం బీసీసీఐ అవకాశం ఇవ్వట్లేదు. ఐపీఎల్ 2022లో అద్బుతంగా రాణించినా టీ20 ప్రపంచకప్ 2022లో చోటివ్వలేదు.
టీ20 ప్రపంచకప్ 2022లో న్యూజిలాండ్ పర్యటనకు సంజూ శాంసన్ ఎంపికైనా.. కేవలం ఒక్కటే మ్యాచ్‌కు తుది జట్టులో స్థానం దక్కింది. ఆ మ్యాచులో మంచి ప్రదర్శనే చేసినా.. ఆరో బౌలర్ కోసం శాంసన్‌ను పక్కనపెట్టారు. టీమిండియాలో ప్రస్తుతం వికెట్ కీపర్ స్థానానికి తీవ్ర పోటీ ఉన్నా.. అన్ని ఫార్మాట్లలో విఫలమవుతున్న రిషబ్ పంత్‌కు మాత్రం బీసీసీఐ వరుసగా అవకాశాలు ఇస్తూనే ఉంది. దాంతో టాలెంట్ ఉన్న సంజూని పక్కనపెట్టడం అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. దీంతో బీసీసీఐని అభిమానులు దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం మిగతా క్రికెట్ బోర్డులకు కూడా తెలిసింది.
భారత జట్టులో సుస్థిర స్థానం కోసం చాలా రోజులుగా పోరాడుతున్న సంజూ శాంసన్‌కు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. తమ దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని సంజూని ఐర్లాండ్ బోర్డు పెద్దలు సంప్రదించినట్లు సమాచారం. భారత క్రికెట్‌తో తెగదెంపులు చేసుకుని ఐర్లాండ్ వస్తే.. అన్ని అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడిస్తామని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ బంపర్ ఆఫర్‌ను సంజూ తిరస్కరించినట్లు తెలుస్తోంది. తన్ను భారత్ తరఫునే ఆడతానని, బీసీసీఐ అవకాశం ఇచ్చేంతవరకు వేచి చూస్తానని సంజూ వారికి చెప్పినట్లు సమాచారం.
2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కేరళ కుర్రాడు సంజు శాంసన్.. ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 27 మ్యాచ్‌లు (11 వన్డేలు, 16 టీ20లు) మాత్రమే ఆడాడు. అది కూడా 2022లో ఆడినవే ఎక్కువ. భారత జట్టులో ప్రస్తుతం దినేష్ కార్తీక్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, కేఎస్ భరత్ వంటి కీపర్లు అందుబాటులో ఉండటంతో శాంసన్‌కు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఏదేమైనా తాజా పరిణామం బీసీసీఐని షాక్‌కు గురిచేసేదే. ఐర్లాండ్ గుర్తించిన సంజూ టాలెంట్‌ను బీసీసీఐ గుర్తించలేదని ఫాన్స్ సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
Also Read: Telangana Rains: మాండౌస్ తుపాను ఎఫెక్ట్.. తెలంగాణలో మరో 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు!
Also Read: Gold Price Today: పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.