Sania Mirza: షోయబ్ మాలిక్‌తో సానియా మీర్జా విడాకులు..? సోషల్ మీడియాలో వైరల్

Sania Mirza Shoaib Malik Divorce: షోయబ్ మాలిక్‌తో వివాహ బంధానికి సానియా మీర్జా స్వస్తి చెప్పనున్నారా..? ఎందుకు సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమేంత..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2022, 10:42 AM IST
Sania Mirza: షోయబ్ మాలిక్‌తో సానియా మీర్జా విడాకులు..? సోషల్ మీడియాలో వైరల్

Sania Mirza Shoaib Malik Divorce: భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మధ్య సఖ్యత బాగోలేదని.. వీడిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. సానియా మీర్జా చేసిన పోస్ట్‌లతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది.

సానియా మీర్జా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తన కొడుకు ఇజాన్‌ల ఫోటోను పంచుకున్నారు. తాను కష్టతరమైన సమయాల్లో తీసుకున్న క్షణాలు అంటూ ఆమె రాసుకొచ్చారు. అంతకుముందు పోస్ట్‌లో విరిగిన హృదయాలు ఎక్కడికి వెళ్తాయి..? అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారని.. వీడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని నెటిజన్లు అంటున్నారు. 

మరోవైపు షోయబ్ మాలిక్-సానిమా మీర్జా తమ కుమారుడు ఇజాన్ పుట్టినరోజు వేడుకలను దుబాయ్‌లో ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మాలిక్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే సానియా మీర్జా ఒక్క ఫోటో కూడా షేర్ చేయలేదు. దీంతో ఇద్దరి మధ్య సంబంధం బాగా లేదంటూ ఊహగానాలు వెలువడుతున్నాయి.

2003లో వీరిద్దరికి పరిచయమైంది. 2009లో ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన రాగా.. రెండు కుటుంబాలను ఒప్పించారు. ఎన్నో విమర్శల నడుమ దేశం సరిహద్దులు చేరిపేస్తూ.. ఇద్దరు 2010లో ఒక్కటయ్యారు. వీరి వివాహం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇండియా-పాక్ మధ్య మ్యాచ్‌లు జరిగినప్పుడు సానియా మీర్జా హాజరవుతూ తన భర్తకు సపోర్ట్ చేస్తూ.. భారత్ గెలవాలని కోరుకునేది. వరల్డ్ బెస్ట్ స్టార్ కపుల్‌గా ఈ జంటకు మంచి పేరు ఉంది. ఎనిదేళ్ల తరువాత 2018లో ఈ జంటకు ఇజాన్ మీర్జా మాలిక్ పుట్టాడు.

12 ఏళ్ల పాటు అన్యోన్యంగా సాగిన వీరి ప్రయాణం ముగిసిందని.. త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారని పాక్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ కేవలం రూమర్స్ అని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఈ విషయంపై సానియా, షోయబ్ మాలిక్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. 

Also Read: MUNUGODE RESULT: రేవంత్ రెడ్డి అవుట్... కేసీఆర్ కు టెన్షన్! బీజేపీ మునుగోడు ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్?

Also Read: T20 World Cup 2022: టీమ్ ఇండియాను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్, ఇండియా ఇంటికేనా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News