Sania Mirza - Shoaib Malik Divorce: విడాకులు తీసుకున్న సానియా, షోయబ్.. ఆ ఒక్క కారణంగానే ఆగారు! అధికారిక ప్రకటన ఎప్పుడంటే.. ?

Sania Mirza - Shoaib Malik to Announce their Divorce Very Soon: సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌‌ తాము విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించకపోవడానికి ఓ కారణం ఉందని తెలుస్తోంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Dec 1, 2022, 08:15 PM IST
  • విడాకులు తీసుకున్న సానియా, షోయబ్
  • అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
  • ఆ ఒక్క కారణంగానే ఇప్పటివరకు ఆగారు
Sania Mirza - Shoaib Malik Divorce: విడాకులు తీసుకున్న సానియా, షోయబ్.. ఆ ఒక్క కారణంగానే ఆగారు! అధికారిక ప్రకటన ఎప్పుడంటే.. ?

Sania Mirza-Shoaib Malik Divorce News: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌‌ల పేర్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ స్పోర్ట్స్ కపుల్స్ విడాకులు తీసుకుంటునున్నారని నెట్టింట వార్తలు రావడమే అందుకు కారణం. చాలా కాలంగా సానియా, మాలిక్‌‌ సంసార జీవితం సాఫీగా సాగడం లేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. చాలా నెలలుగా ఈ స్పోర్ట్స్ కపుల్స్ కలిసి ఉండడం లేదని, విడాకులకు సిద్ధమయ్యారని రూమర్లు వస్తున్నాయి. విడాకుల గురించి ఎన్నో రూమర్లు వస్తున్నా.. ఇటు సానియా, అటు మాలిక్‌‌ ఇప్పటివరకు స్పందించపోవడం విశేషం. 

షోయబ్ మాలిక్‌‌ పాకిస్థాన్ నటి అయేషా ఒమర్‌తో సన్నిహితంగా ఉంటున్నాడని సోషల్ మీడియాలో తాజాగా ఓ వార్త వైరల్ అయింది. కొన్నాళ్ల క్రితం మాలిక్‌కు అయేషాతో ఏర్పడిన పరిచయం కాస్త.. ప్రేమగా మారిందట. అది ప్రేమ కాస్త చనువుగా ఉండే వరకు వెళ్లిందట. అయేషా మోజులో పడిన మాలిక్.. సానియాను ఏమాత్రం పట్టించుకోవడం లేదట. భర్త మోసం చేయడంతోనే.. సానియా విడాకుల వరకు వెళ్లిందట. అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... సానియా మీర్జా మరియు షోయబ్ మాలిక్‌‌ తాము విడిపోతున్నట్లు అధికారికంగా ఇంకా ప్రకటించకపోవడానికి ఓ కారణం ఉంది. ఇద్దరు కలిసి చేస్తున్న 'ది మీర్జా మాలిక్ షో' కారణంగానే విడాకులు తీసుకోలేదట. షో ఒప్పందం ప్రకారం ఈ స్పోర్ట్స్ కపుల్స్ ఈ సున్నితమైన సమాచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ బహిర్గతం చేయకూడదట. దాంతో షో పూర్తయిన తర్వాత మాత్రమే ఇద్దరూ తమ విడాకుల గురించి అధికారిక ప్రకటన చేస్తారని ఓ నివేదిక పేర్కొంది. ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

సానియా మీర్జా తన ఇన్‌స్టాగ్రామ్‌లో నిరంతరం పోస్ట్‌లను షేర్ చేస్తూ.. అభిమానులను మరియు మీడియాను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఓ పోస్టులో తమ వివాహ బంధం అంతా బాగానే ఉందనేలా, మరో పోస్టులో విడాకులకు సిద్ధం అయినట్టు పోస్ట్‌లను షేర్ చేస్తున్నారు. దాంతో సానియా మీర్జా కన్ఫర్మేషన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సానియా, మాలిక్‌ల వివాహం 2010లో జరగ్గా.. నాలుగేళ్ల క్రితం వీరికి ఓ కుమారుడు జన్మించాడు.

Also Read: Sabarimala Income 2022: శబరిమల అయ్యప్ప ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం.. కేవలం 10 రోజుల్లోనే..!  

Also Read: Man Tiger Mosquito Bite: దోమ కాటుతో కోమాలోకి.. 30 శస్త్రచికిత్సలు! బతికుండగానే నరకం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News