Sachin Tendulkar Free Cricket Sessions: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్ నేర్పిస్తానంటే వద్దనే యువకులు, చిన్నారులు ఎవరైనా ఉంటారా. తాజాగా అలాంటి అవకాశం మీకోసం ఎదురుచూస్తుంది. సచిన్ ఉచితంగా క్రికెట్ పాఠాలు, చిట్కాలు బోధించనున్నాడు. ఆన్‌లైన్ వేదికగా లైవ్ ఇంటరాక్టివ్ సెషన్ తరగతులు నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు.
ఏ మాత్రం ఖర్చు లేకుండా మీరు ఉచితంగా క్రికెట్ చిట్కాలు, పాఠాలు నేర్చుకోబోతున్నారు. సచిన్ లాంటి క్రికెటర్ నుంచి చిట్కాలు వద్దనుకునే యువ ఆశాకిరణాలు ఉండరంటే నమ్మశక్యం కాదు. ఏఎన్‌ఐ మీడియాతో సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ఈ విషయాలు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) ప్రస్తావించాడు. గతంలో చాలా మంది క్రికెటర్లకు, చిన్నారులకు ప్రత్యక్షంగా క్రికెట్ చిట్కాలు చెప్పాను. సలహాలు కూడా ఇచ్చాను. ఇప్పుడు తొలిసారి ఆన్‌లైన్ వేదికగా క్లాసులు తీసుకోబోతున్నానని చెప్పాడు.
Also Read: Vijay Hazare Trophy: టీమిండియా పేసర్ Sreesanth, 15 ఏళ్ల తరువాత అరుదైన ఘనత
‘ఉచితంగా క్రికెట్ పాఠాలు బోధించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ అన్‌అకాడెమీ నుంచి జాయిన్ అయ్యి క్రికెట్ క్లాసెస్ వినవచ్చు. గతంలో కేవలం కొందరికి మాత్రమే సూచనలు, సలహాలు ఇచ్చాను. ఆన్‌లైన్ వేదిక కావడంతో మిలియన్ల మంది యువకులు, చిన్నారులకు క్రికెట్ పాఠాలు చెప్పబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ప్రశ్నలకు నేను బదులిస్తాను. తోచిన సలహాలు చెబుతానని’ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వివరించాడు.
Also Read: IPL 2021 Latest News: కేవలం రెండు రాష్ట్రాల్లోనే ఐపీఎల్ 2021 నిర్వహించాలని యోచిస్తున్న BCCI
ఇటీవల జరిగిన ఐపీఎల్ 2021 మినీ వేలంలో సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar)ను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రూ.20 బేస్ ధరకే కొనుగోలు చేసింది. దీంతో క్రికెట్ దిగ్గజం సచిన్ తనయుడు ఐపీఎల్ అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. తనకు ముంబై ఇండియన్స్ జట్టు అంటే ఎంతో ఇష్టమని, తాను చిన్ననాటి నుంచి ఆ ఫ్రాంచైజీకి పెద్ద అభిమానినని అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ 2021 వేలం తరువాత స్పందించాడు.
Also Read: EPFO: 4 విధాలుగా మీ ఖాతాల్లోని PF Balanceను సులువుగా చెక్ చేసుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook