ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్ ఎలెవన్ (Dream11) ఎంపికవడం తెలిసిందే. దిగ్గజ కంపెనీలను సైతం వెనక్కి నెట్టి ఈ అవకాశాన్ని డ్రీమ్11 దక్కించుకుంది. అయితే ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ డ్రీమ్ ఎలెవన్ (Dream11 As IPL 2020 Title Sponsor) ఏడాదికి రూ.222 కోట్ల మేర భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి చెల్లించడానికి డీల్ కుదిరింది. కానీ ఇదేమీ పెద్ద బిజినెస్ డీల్ కాదని తెలుస్తోంది. ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ Dream11.. ఎంత చెల్లిస్తుందంటే?
డ్రీమ్ ఎలెవన్ టైటిల్ స్పాన్సర్ చేయడంతో బీసీసీఐకి ఏడాదికి దాదాపుగా 50శాతం నష్టం వాటిల్లనుంది. ఎలాగంటే.. 2018లో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా చైనా కంపెనీ వివో నిలిచింది. అయిదేళ్లకుగానూ రూ.2,199 కోట్ల మొత్తాన్ని బీసీసీఐకి వివో చెల్లించడానికి డీల్ కుదిరింది. అంటే ఏడాదికి రూ.439.80 కోట్లమేర వివో నుంచి బీసీసీఐకి లాభం చేకూరేది. Hardik Pandya Son Name: బుజ్జి హార్దిక్ పాండ్యా పేరేంటో తెలుసా?
ప్రస్తుత ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ డ్రీమ్ ఎలెవన్ ఏడాదికి కేవలం రూ.222కోట్లు మాత్రమే బీసీసీఐకి చెల్లించనుంది. అంటే వివో చెల్లించే నగదులో దాదాపుగా సగం.. ఏడాదికి రూ.217.80 కోట్ల మేర బీసీసీఐకి నష్టమే. కానీ చైనా కంపెనీ వివోను స్పాన్సర్షిప్ నుంచి తొలగించాక, ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకొచ్చిన డ్రీమ్ ఎలెవన్ వైపు బీసీసీఐ మొగ్గు చూపాల్సి వచ్చింది. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...
Jiya Roy Hot Stills: బెంగాల్ బ్యూటీ జియా రాయ్ ట్రెండింగ్ ఫొటోలు