Athiya Shetty: కేఎల్ రాహుల్ గోల్డెన్ డక్.. ముక్కలైన అతియా శెట్టి మనసు! రియాక్షన్ చూస్తే అంతే..

Athiya Shetty Reaction After KL Rahul golden duck. కేఎల్ రాహుల్ గోల్డెన్ డక్‌ అవ్వడంతో స్టేడియంలో ఉన్న అతడి ప్రియురాలు, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి మనసు ఒక్కసారిగా ముక్కలయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 11, 2022, 03:08 PM IST
  • కేఎల్ రాహుల్ గోల్డెన్ డక్
  • ముక్కలైన అతియా శెట్టి మనసు
  • అతియా రియాక్షన్ చూస్తే అంతే..
Athiya Shetty: కేఎల్ రాహుల్ గోల్డెన్ డక్.. ముక్కలైన అతియా శెట్టి మనసు! రియాక్షన్ చూస్తే అంతే..

Athiya Shetty Reaction goes viral After KL Rahul bowled for a golden duck : ఐపీఎల్ 2019, 2021, 2022లో పరుగుల వరద పారించిన టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్.. తాజా సీజన్లో మాత్రం కాస్త తడబడుతున్నాడు. ఐపీఎల్ 2022లో భాగంగా ఇప్పటివరకు ఐదు మ్యాచులు ఆడిన రాహుల్ 132 పరుగులు చేశాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో వరుసగా 0, 40, 68, 24, 0 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో గోల్డెన్ డక్‌ట్ అయిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రాహుల్.. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో కూడా మరోసారి గోల్డెన్ డక్‌ట్ అయ్యాడు. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డయ్యాడు. 

రాజస్థాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే కేఎల్ రాహుల్ ఔట్ అయ్యాడు. బౌల్ట్ వేసిన ఇన్ స్వింగ్ డెలివరీని రాహుల్ ఆడలేకపోయాడు. రెప్పపాటులో బ్యాట్, ఫ్యాడ్ మధ్యలో నుంచి దూసుకెళ్లిన బంతి.. మిడిల్, లెగ్ వికెట్లని గీరాటేసింది. దాంతో రాహుల్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. బౌల్ట్ వేసిన ఆ బంతికి ఫాన్స్, కామెంటేటర్లు కూడా బిత్తరపోయారు. ఇక  గోల్డెన్ డక్‌ట్ అవ్వడంతో రాహుల్ నిరాశగా పెవిలియన్ చేరాడు. 

కేఎల్ రాహుల్ గోల్డెన్ డక్‌ అవ్వడంతో స్టేడియంలో ఉన్న అతడి ప్రియురాలు, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి మనసు ఒక్కసారిగా ముక్కలయింది. రాహుల్ గోల్డెన్ డకౌటవ్వడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. పేస్ అదోలా పెట్టి తన నిరాశను వ్యక్తం చేశారు. మొత్తానికి రాహుల్ ఆటను చూసేందుకు తండ్రి సునీల్ శెట్టితో కలిసి మ్యాచ్‌కు వచ్చిన అతియాకు నిరాశే ఎదురైంది. అతియా శెట్టి రియాక్షన్‌కు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  

ఈ మ్యాచులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. షిమ్రన్ హెట్‌మైర్ (59 నాటౌట్; 36 బంతుల్లో 1x4, 6x6) హాఫ్ సెంచరీ చేయగా.. దేవదత్ పడిక్కల్ (29), రవిచంద్రన్ అశ్విన్ (28) రాణించారు. లక్నో బౌలర్లలో జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్ రెండేసి వికెట్లు తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. మార్కస్ స్టోయినీస్ (38), క్వింటన్ డికాక్ (39) టాప్ స్కోరర్లు. యుజ్వేంద్ర చహల్ 4 వికెట్లు పడగొట్టాడు. 

Also Read: Acharya Trailer: చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. థియేటర్లలో 'ఆచార్య' ట్రైలర్! ఎక్కడో తెలుసా?

Also Read: KGF Chapter 2: కథలో కీలకమైన విషయాన్ని చెప్పిన యష్.. అసలు స్టోరీ రివీల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News