రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ( RCB ) టీమ్ విజయ పరంపర కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals ) టీమ్ పై 8 వికెట్లతో విజయం సాధించింది. ఆర్సీబీ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ 53 పరుగుల్లో 72 పరుగులు చేశాడు.అంతకు ముందు రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. ఆర్సీబి బౌలర్లు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపిస్తూ రాజస్థాన్ టీమ్ ను 20 ఓవర్లలో 154 పరుగులు మాత్రమే చేసే అవకాశం ఇచ్చారు.
ALSO READ| IPL 2020: ధోనీ నుంచి కోహ్లీ వరకు ఐపిఎల్ లో కెప్టెన్ల జీతభత్యాలు ఇవే
ఆర్సీబీ బౌలర్లు మొదటి నుంచే రాజస్థాన్ బ్యాట్స్ మెన్ ను కట్టడిచేయడం ప్రారంభించారు. దీంతో రాజస్థాన టీమ్ నాలుగు ఓవర్లు 31 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. మహిపాల్ లోమ్రార్ మాత్రం 39 బంతుల్లో 47 రన్స్ చేశారు. అయితే అప్పటికే స్లో రన్ రేట్ వల్ల తక్కువ పరుగులు నమోదు అయ్యాయి. రాహుల్ తేవాటియా, జోఫ్రా ఆర్చర్ కలిసి రాజస్థాన్ రాజయల్స్ టీమ్ కు 150 పరుగుల మర్యాదకరమైన స్కోర్ ను అందించారు. అయితే రాజస్తాన్ రాయల్స్ టీమ్ ఐపీఎల్ 2020లో ( IPL 2020) గత రెండు మ్యాచుల్లో 216, 226 పరుగులు సాధించి మంచి విజయాన్ని నమోదు చేసింది. కానీ ఈ సారి మాత్రం వారికి అంతగా కలిసి రాలేదు.
ALSO READ| IPL Records: ఐపిఎల్ ఫైనల్స్ లో 50 కొట్టిన కెప్టెన్లు .. వారి పేర్లు ఇవే
ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు థ్రిల్లింగ్ విజయాలు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముందుగా ముంబై ఇండియన్స్ పై విజయం సాధించిన ఆర్సీబి తరువాత తన విజయపరంపరను కొనసాగిస్తోంది. దాంతో పాటు ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ కూడా తన టీమ్ ను గెలిపించడానికి చేస్తున్న ప్రయత్నాలు అభిమానులను అలరిస్తోంది. మొత్తంగా రాజస్థాన్ టీమ్ నిర్ధేశించిన 155 పరుగులు లక్ష్యాన్ని బెంగుళూరు టీమ్ 19.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR