Rishabh Pant Car Accident: మూడేళ్ల క్రితమే హెచ్చరించిన శిఖర్ ధావన్‌.. పట్టించుకోని రిషబ్ పంత్!

Shikhar Dhawan valuable advice to Rishabh Pant during IPL 2019. మూడేళ్ల క్రితమే టీమిండియా సీనియర్ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ డ్రైవింగ్‌ విషయంలో రిషబ్ పంత్‌ను హెచ్చరించాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 30, 2022, 09:22 PM IST
  • మూడేళ్ల క్రితమే హెచ్చరించిన శిఖర్ ధావన్‌
  • పట్టించుకోని రిషబ్ పంత్
  • ధావన్‌-పంత్‌ల వీడియో వైరల్
Rishabh Pant Car Accident: మూడేళ్ల క్రితమే హెచ్చరించిన శిఖర్ ధావన్‌.. పట్టించుకోని రిషబ్ పంత్!

Shikhar Dhawan gives most valuable advice to Rishabh Pant 3 Years ago: టీమిండియా యువ బ్యాటర్‌ రిషబ్ పంత్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌ వెళ్తుండగా రూర్కీ సమీపంలో పంత్‌ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారు అతడిని దేహ్రాదూన్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పంత్‌ తల, మోకాలికి తీవ్ర గాయమైంది. ఇక వీపు భాగం కాలిపోయింది. అయితే ప్రస్తుతం పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడానే ఉన్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

కారుకు మంటలు అంటుకోవడంతో రిషబ్ పంత్‌ అద్దాల నుంచి బయటపడడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని సమాచారం తెలుస్తోంది. మూడేళ్ల క్రితమే టీమిండియా సీనియర్ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ డ్రైవింగ్‌ విషయంలో పంత్‌ను హెచ్చరించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2019 సమయంలో పంత్‌ను గబ్బర్ హెచ్చరించాడట. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. 2019లో పంత్‌, ధావన్‌లు ఐపీఎల్ ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు ఆడిన సంగతి తెలిసిందే. 

2019 సందర్భంగా రిషబ్ పంత్‌, శిఖర్‌ ధావన్‌ సరదాగా ఒకరినొకరు ఇంటర్య్వూ చేసుకున్నారు. ఆ సమయంలో ధావన్ భయ్యా ఒక సీనియర్‌గా నువ్వు నాకు ఏమైనా అడ్వైజ్‌ ఇస్తావా? అని పంత్ అడిగాడు. అప్పుడు ధావన్ స్పందిస్తూ.. 'డ్రైవింగ్‌ విషయంలో కాస్త జాగ్రత్త వహించు. నెమ్మదిగా వెళ్లు' అని చెప్పాడు. ఈరోజు పంత్‌ కారు ప్రమాదంకు గురవడంతో ధావన్‌-పంత్‌ల పాత వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో ధావన్ పంజాబ్ కింగ్స్‌కు మారగా.. పంత్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. 

Also Read: న్యూ ఇయర్ 2023 ఆంక్షలు.. హైదరాబాద్ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

Also Read: Rishabh Pant Car Accident: మన్సూర్ పటౌడీ నుంచి ఆండ్రూ సైమండ్స్ వరకు.. రోడ్డు ప్రమాదంకు గురైన క్రికెటర్లు వీరే!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News