IPL Jio Data Plans: ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు డేటా సరిపోవడం లేదా, టాప్ 5 జియో డేటా ప్లాన్స్ ఇవే

IPL Jio Data Plans: ఐపీఎల్ 2024 అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. స్డేడియంలో పరుగుల వరద పారుతుండటంతో క్రికెట్ ప్రేమికులు టీవీ, మొబైల్స్‌కు అతుక్కుపోతున్నారు. అందుకే జియో 5 అద్భుతమైన డేటా ప్లాన్స్ అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 21, 2024, 09:58 AM IST
IPL Jio Data Plans: ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు డేటా సరిపోవడం లేదా, టాప్ 5 జియో డేటా ప్లాన్స్ ఇవే

IPL Jio Data Plans: ఐపీఎల్ 2024 మ్యాచ్‌లు జియో సినిమాలో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతుండటంతో అత్యధిక శాతం జియో ఓటీటీ నుంచే మ్యాచ్‌లు వీక్షిస్తున్నారు. అంతేకాకుండా ఇంటర్నెట్ డేటా అంతరాయం లేకుండా ఉండేందుకు కొన్ని డేటా రీఛార్జ్ ప్లాన్స్ కూడా అందిస్తోంది. ఈ ప్లాన్స్‌లో మీకు అనువైనవి ఎంచుకుని ఐపీఎల్ మ్యాచ్‌లను అంతరాయం లేకుండా వీక్షించండి.

ఐపీఎల్ 2024 మ్యాచ్‌లు అప్పుడే 35 వరకూ పూర్తయ్యాయి. ఇంకా సగం మ్యాచ్‌లు ఉన్నాయి. మరో నెలరోజులు ఐపీఎల్ అందర్నీ అలరించనుంది. అటు జియో సినిమాలో ఉచితంగా స్ట్రీమింగ్ ఉండటంతో అందరూ జియో సినిమా ఓటీటీకు అతుక్కుపోతున్నారు. మరిప్పుడు కావల్సింది అంతరాయం లేని డేటా ప్లాన్స్. మ్యాచ్‌లు చూసేందుకు రెగ్యులర్ డేటా సరిపోదు. దీనికోసం రిలయన్స్ జియో సరికొత్త డేటా రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. ఈ ప్లాన్స్ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా రిలయన్స్ జియో ప్లాన్ చేసింది. కనీసం 15 రూపాయల్నించి ప్రారంభమై... 60 రూపాయల్లోపే ఉన్నాయి. 

జియో 15 రూపాయలు రీఛార్జ్ ప్లాన్‌లో 1 జీబీ డేటా లభిస్తుంది. మీరు ప్రస్తుతం వినియోగిస్తున్న ప్లాన్ వరకూ ఈ డేటా వర్తిస్తుంది. మీ రోజువారీ డేటా పూర్తయిపోతే 15 రూపాయలతో రీఛార్జ్ చేయించుకుంటే మరో 1 జీబీ డేటా లభిస్తుంది. ఇక రెండవది జియో 19 రూపాయల రీఛార్జ్ ప్లాన్. ఇందులో 1.5 జీబీ డేటా లభిస్తుంది. మీ రెగ్యులర్ ప్లాన్ ఉన్నంతవరకూ ఇది వర్తిస్తుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు 1.5 జీబీ సరిపోవచ్చు.

ఇక మూడవది జియో 25 రూపాయల రీఛార్జ్ ప్లాన్. ఇందులో 2 జీబీ డేటా లభిస్తుంది. ఇది కూడా రెగ్యులర్ ప్లాన్ కాలపరిమితి వరకూ అందుబాటులో ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు బెస్ట్ ప్లాన్. నాలుగవది జియో 29 రూపాయల రీఛార్జ్ ప్లాన్. ఇందులో 3 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో కేవలం డేటా మాత్రమే ఉంటుంది. మరే ఇతర ప్రయోజనాలు వర్తించవు. రెగ్యులర్ ప్లాన్ చెల్లుబాటయ్యేవరకూ వాడుకోవచ్చు. 

ఇక ఐదవ ప్లాన్ జియో 61 రూపాయల రీఛార్జ్ ప్లాన్. ఇది కూడా మీ రెగ్యులర్ ప్లాన్ ఉన్నంతవరకూ వర్తిస్తుంది. ఇందులో ఏకంగా 6 జీబీ డేటా లభిస్తుంది. వరుసగా రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు చూడవచ్చు. అంటే కేవలం 30 రూపాయల ఖర్చుతో ఒక ఐపీఎల్ మ్యాచ్ పూర్తిగా వీక్షించవచ్చు.

Also read: AP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు రేపే, ఎలా చెక్ చేసుకోవాలంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News