Harshal Patel: బయోబబుల్‌ వీడిన బెంగళూరు స్టార్ బౌలర్‌.. చెన్నైతో మ్యాచ్‌లో ఆడేది అనుమానమే!

RCB bowler Harshal Patel leaves IPL 2022 bio-bubble. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బౌలర్ హర్షల్ పటేల్.. ఐపీఎల్ 2022 బయోబబుల్‌ వీడాడు. తన సోదరి చనిపోవడంతో హర్షల్ బబుల్‌ వీడి ఇంటికి వెళ్లినట్లు సమాచారం తెలుస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 10, 2022, 02:48 PM IST
  • బయోబబుల్‌ వీడిన హర్షల్ పటేల్
  • చెన్నైతో మ్యాచ్‌లో ఆడేది అనుమాన
  • నాలుగు మ్యాచ్‌లలో 6 వికెట్లు
Harshal Patel: బయోబబుల్‌ వీడిన బెంగళూరు స్టార్ బౌలర్‌.. చెన్నైతో మ్యాచ్‌లో ఆడేది అనుమానమే!

RCB bowler Harshal Patel leaves IPL 2022 bio-bubble due to His sister death: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బౌలర్ హర్షల్ పటేల్.. ఐపీఎల్ 2022 బయోబబుల్‌ వీడాడు. తన సోదరి చనిపోవడంతో హర్షల్ బబుల్‌ వీడి ఇంటికి వెళ్లినట్లు సమాచారం తెలుస్తోంది. శనివారం (ఏప్రిల్ 9) రాత్రి ముంబై ఇండియన్స్‌పై బెంగళూరు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత జరిగిన విషాదం హర్షల్‌కు తెలిసింది. దాంతో హుటాహుటిన అతడు ఇంటికి పయనమయ్యాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తదుపరి మ్యాచ్‌ ఏప్రిల్ 12న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు హర్షల్ పటేల్ అందుబాటులోకి వస్తాడా? లేదా? అన్న అనుమానాలు ఉన్నాయి. అందుకు కారణం.. బయోబబుల్ వీడిన ఆటగాళ్లు మూడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలనే ఐపీఎల్ నిబంధనలే. అయితే దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నా.. కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ఈక్రమంలో ఐపీఎల్ నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడే తదుపరి మ్యాచ్‌లో హర్షల్ పటేల్‌ ఆడతాడని ఆర్‌సీబీ జట్టు స్పష్టం చేస్తోంది. ఏప్రిల్ 12 చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచుకు ముందే అతను బయోబబుల్‌లో తిరిగి చేరతాడని ఆర్‌సీబీ యాజమాన్యం అంటోంది. 'హర్షల్ పటేల్ తన కుటుంబంలో మరణం కారణంగా బయోబబుల్‌ను విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఏప్రిల్ 12న చెన్నైతో జరిగే తదుపరి మ్యాచ్‌కి ముందు అతను మళ్లీ బబుల్‌లో చేరతాడు' అని ఆర్‌సీబీ పేర్కొన్నట్టు ఓ జాతీయ మీడియా తీగమా కథనంలో పేర్కొంది. 

ఐపీఎల్ 2021లో 15 మ్యాచులు ఆడిన హర్షల్ పటేల్‌ ఏకంగా 32 వికెట్లు పడగొట్టి..  పర్పుల్‌ క్యాప్‌ అందుకున్నాడు. అందుకే హర్షల్‌ను ఇతర జట్లతో పోటీ మరీ ఐపీఎల్ 2022 వేలంలో 10.75 కోట్లకు సొంతం చేసుకుంది. అంచనాలకు తగ్గట్టుగా ఐపీఎల్‌ 2022లో అతడు రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో 6 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు లోయర్ ఆర్డర్‌లో కొన్ని విలువైన పరుగులు కూడా చేశాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన హర్షల్‌.. 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. 

Also Read: Pawan Kalyan: 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' పోస్ట‌ర్‌ వచ్చేసింది.. పవన్‌ కళ్యాణ్ న్యూ లుక్‌ చూశారా?

Also Read: Sitara Dance: తొలిసారి కూచిపూడి డ్యాన్స్‌ చేసిన సీతూ పాప.. ఆనందం వ్యక్తం చేసిన సూపర్ స్టార్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News