RCB vs KKR match highlights: ఐపీఎల్-13లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌తో ఆల్ రౌండ్ ప్రతిభ కనబరుస్తూ టాప్ 3లోకి దూసుకుపోయింది. సోమవారం షార్జా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాను 82 పరుగుల తేడాతో మట్టి కరిపించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ).. పాయింట్స్ పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంది. ముందుగా టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టేన్ విరాట్ కోహ్లీ ( Virat kohli ) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders ) ఆటగాళ్లు ఏ దశలోనూ బెంగళూరుకు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. ఫలితంగా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టపోయి కేవలం 112 పరుగులకే కోల్‌కతా చాపచుట్టేసింది. Also read : Ishant Sharma rib injury: ఐపిఎల్ 2020 నుండి ఇషాంత్ శర్మ ఔట్
కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ( Shubman Gill 34 పరుగులు; 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోల్‌కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్ (1), టామ్ బాంటన్ (8), నితీశ్ రాణా (9), ఇయాన్ మోర్గాన్ (8), ఆండ్రూ రస్సెల్ (16) అందరూ బెంగళూరు బౌలర్ల ధాటికి క్రీజులో నిలవలేక ఇలా స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ బాటపట్టారు. బెంగళూరు బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar 2/20), క్రిస్ మోరీస్ (2/17) చెరో రెండు వికెట్లు తీసుకోగా, నవదీప్ షైని, మొహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ఇసురు ఉడనలకు ఒక్కో వికెట్ లభించింది. Also read : Sunil Narine's bowling: సునీల్ నరైన్ బౌలింగ్‌పై KKR స్పందన
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ విషయానికొస్తే.. ఓపెనర్స్ అరోన్ ఫించ్ ( Aaron Finch 47 పరుగులు; 37 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్ ), దేవదత్ పడిక్కల్ ( Devdutt Padikkal 32 పరుగులు; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) శుభారంభాన్నిచ్చారు. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ ( Ab De villiers 73 పరుగులు నాటౌట్; 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు)తో మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli 33 పరుగులు నాటౌట్: 28 బంతుల్లో 1 ఫోర్) రాబట్టాడు. దీంతో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేయగలిగింది. Also read : IPL 2020లో తక్కువ రన్స్ ఇచ్చిన బెస్ట్ బౌలర్ ఎవరో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe