Ravichandran Ashwin: టీమిండియాకు క్షమాపణలు చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా

Ravichandran Ashwin: ఆస్ట్రేలియా జట్టుతో క్రికెట్ అంటే చాలు.. అందులోనూ వారి గడ్డ మీద అంటే పర్యాటక జట్టుకు ఎన్నో సవాళ్లు. ఓడిపోతారనే ఆలోచన వస్తే చాలు.. ఆటగాళ్లతో పాటు ఆ దేశ అభిమానులు, మ్యాచ్ వీక్షకులు తమ నోటికి పని చెబుతుంటారు. ప్రస్తుతం జరుగుతోన్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇలాంటి ఘటనలు జరిగాయి. జాత్యహంకార వ్యాఖ్యలు చేసి భారత క్రికెటర్లను అవమానిస్తున్నారు. విమర్శలు రావడం, టీమిండియా సైతం అంపైర్లకు ఫిర్యాదు చేయడంతో వివాదం ముదరకూడదని భావించిన క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణలు సైతం చెప్పింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2021, 06:21 PM IST
  • ఆస్ట్రేలియా గడ్డ మీద అంటే పర్యాటక జట్టుకు ఎన్నో సవాళ్లు
  • ఆటగాళ్లతో పాటు ఆ దేశ అభిమానులు తమ నోటికి పని చెబుతుంటారు
  • గతంలో సిడ్నీలో ఎన్నో పర్యాయాలు ఇలాంటి ఘటనలు జరిగాయి
Ravichandran Ashwin: టీమిండియాకు క్షమాపణలు చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా

Faced Racism in Sydney Earlier too: Ravichandran Ashwin: ఆస్ట్రేలియా జట్టుతో క్రికెట్ అంటే చాలు.. అందులోనూ వారి గడ్డ మీద అంటే పర్యాటక జట్టుకు ఎన్నో సవాళ్లు. ఓడిపోతారనే ఆలోచన వస్తే చాలు.. ఆటగాళ్లతో పాటు ఆ దేశ అభిమానులు, మ్యాచ్ వీక్షకులు తమ నోటికి పని చెబుతుంటారు. ప్రస్తుతం జరుగుతోన్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇలాంటి ఘటనలు జరిగాయి. జాత్యహంకార వ్యాఖ్యలు చేసి భారత క్రికెటర్లను అవమానిస్తున్నారు. విమర్శలు రావడం, టీమిండియా సైతం అంపైర్లకు ఫిర్యాదు చేయడంతో వివాదం ముదరకూడదని భావించిన క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణలు సైతం చెప్పింది.

భారత(Team India) బౌలర్ మహ్మద్ సిరాజ్‌పై మరోసారి జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. అంపైర్లకు ఫిర్యాదు చేయగా వారు భద్రతా సిబ్బందికి సమాచారం అందించి 10 మంది వీక్షకులను మైదానం నుంచి బయటకు పంపించివేశారు. దీనిపై రవిచంద్రన్ అశ్విన్ మీడియాతో మాట్లాడాడు. గతంలో సిడ్నీ మైదానంలో ఎన్నో పర్యాయాలు ఇలాంటి ఘటనలు జరిగాయని, పర్యాటక జట్లకు ఇది కొత్త విషయం కాదని పేర్కొన్నాడు. ముఖ్యంగా సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లలో పర్యాటక జట్టు ఫీల్డర్లను వీక్షకులు దూషించేవారని చెప్పాడు.

Also Read: IND vs AUS 3rd Test: టీమిండియా ముందు కొండంత లక్ష్యం.. మరో పరాభవం తప్పదా?

ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా(Australia) టెస్ట్ సిరీస్‌లో ఇది మరో స్థాయికి వెళ్లిందన్నాడు. ఏకంగా జాత్యహంకార మాటల దాటికి వీక్షకులు దిగుతున్నారని, ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఇది అస్త్రంగా చేసుకున్నారని చెప్పాడు. గతంలో కొన్ని పర్యాయాలలో ఆటగాళ్లే నేరుగా తమ మాటలతో బదులు సైతం ఇచ్చేవారని, ప్రస్తుతం అది హద్దులు దాటి జాత్యహంకార వ్యాఖ్యలకు దారి తీసిందని వివరిచాడు.

Also Read: Steve Smith: టెస్టుల్లో తొలి క్రికెటర్‌గా స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత

తాను సైతం వ్యక్తిగతంగా జాత్యహంకార వ్యాఖ్యల్ని ఎదుర్కొన్నానని, అవమానాలు పడ్డానని అశ్విన్ తెలిపాడు. ఇలాంటి చేష్టలతో తాము నిరాశ చెందామని చెప్పడం చాలా చిన్న మాట అవుతుందన్నాడు. కానీ ఇలాంటి చేష్టలను సహించకూడదని, ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండేందుకు పిడికిలి బిగించాలని పిలుపునిచ్చాడు అశ్విన్.

Also Read: Ravindra Jadeja ఫీల్డింగ్ మాయాజాలం.. స్టీవ్ స్మిత్ షాక్.. వీడియో వైరల్

కాగా, టెస్టు మూడోరోజు సిరాజ్, బుమ్రాలపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని ఐసీసీకి టీమిండియా శనివారం రోజే ఫిర్యాదు చేసింది. మరోసారి నాలుగోరోజు సైతం వీక్షకులు సిరాజ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అంపైర్లకు ఫిర్యాదు చేశారు. కెప్టెన్ రహానే ఫిర్యాదుతో స్పందించిన అంపైర్లు భద్రతా సిబ్బందిని అలర్ట్ చేయగా.. అతిగా ప్రవర్తించిన కొందరు వీక్షకులను బయటకు పంపివేసినట్లు సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News