R Ashwin recalls Ravi Shastri calling Kuldeep Yadav Team India's No.1 overseas spinner: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) గత ఏడాది కాలంగా తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో రాణించడమే కాకుండా నాలుగు సంవత్సరాల తర్వాత పరిమిత ఓవర్ల జట్టులోకి వచ్చాడు. 2021 ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ విజయంలో యాష్ కీలక పాత్ర పోషించాడు. ఆపై న్యూజిలాండ్, ఇంగ్లండ్‌తో జరిగిన హోమ్ సిరీస్‌లో 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డును గెలుచుకున్నాడు. ఇక ఇంగ్లండ్‌లో జరిగిన సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లలో ఒక్కటీ ఆడనప్పటికీ.. అశ్విన్ 2021లో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. అయితే 2017లో వన్డే, టీ20 జట్లలో చోటు కోల్పోయిన యాష్.. గడ్డుపరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఆ ఘటనలను తాజాగా గుర్తుచేసుకున్నాడు.
2018-19లో అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో భారత్‌కు విజయం అందించడంలో కీలక పాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin).. ఫిట్‌నెస్ సమస్యలతో తదుపరి మూడు గేమ్‌లకు దూరమయ్యాడు. సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరు స్పిన్నర్లను ఆడాలని నిర్ణయించుకోవడంతో.. కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)కు అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని కుల్దీప్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. సిడ్నీ టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టిన మణికట్టు స్పిన్నర్ అందరి ప్రశంసలు పొందాడు. అప్పటి హెడ్‌కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) అయితే.. కుల్దీప్ ఓవర్సీస్ నంబర్ 1 అని పేర్కొన్నాడు. దాంతో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన యాష్.. నిరాశచెండాడట. అప్పుడు తనను బస్సు కింద పడేసినట్లుగా అనిపించిందని పేర్కొన్నాడు.
Also Read: అదృష్టం అంటే ఇదేమరి.. బౌల్డ్ అయినా బ్యాటింగ్ కొనసాగించిన బ్యాటర్!! (వీడియో)
క్రికెట్ మంత్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) మాట్లాడుతూ... 'నేను రవిశాస్త్రిని ఎంతో గౌరవిస్తా. ఎవరైనా కొన్నిసార్లు ఏదో మాట్లాడి.. ఆ తర్వాత వాటిని వెనక్కి తీసుకుంటారని తెలుసు. ఏదేమైనా ఆ సమయంలో నేను చాలా బాధపడ్డా. అయితే వ్యక్తిగతంగా కుల్దీప్ యాదవ్ ప్రదర్శనతో నేనెంతో సంతోషించా. ఆస్ట్రేలియాలో నాకు ఐదు వికెట్లు దక్కకపోయినా.. అతడికి దక్కాయని ఆనందించా. అదెంత గొప్ప విషయమో నాకు తెలుసు. అంతకుముందు నేను ఆస్ట్రేలియాలో ఎన్నిసార్లు బౌలింగ్ చేసినా.. ఎప్పుడూ ఐదు వికెట్లు నాకు రాలేదు. అందుకే మనస్ఫూర్తిగా కుల్దీప్ పట్ల సంతోషంగా ఉన్నాను' అని తెలిపాడు.
Also Read: Sussanne Khan : హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ అతనితో డేటింగ్? లవ్ యూ అంటూ రచ్చ రచ్చ
'ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచాక పార్టీలో పాల్గొనడానికి నా మనసు ఒప్పుకోలేదు. ఓ పార్టీలో భాగస్వామి అవ్వాలంటే.. ఆ విజయంలో నా పాత్ర కూడా ఉండాలనుకుంటా. నేను ఆడకున్నా.. జట్టు విజయాన్ని ఎలా ఆస్వాదిస్తా?. బస్సు కింద పడేసినట్లుగా అనిపించింది. పార్టీ నుంచి నా గదికెళ్లి భార్య, పిల్లలతో మాట్లాడా. ఆ తర్వాత మనసు మార్చుకొని పార్టీలో పాల్గొన్నా. ఎందుకంటే అది ఒక చారిత్రక విజయం. ఆ సిరీస్ తర్వాత చాలాసార్లు ఆటకు వీడ్కోలు చెప్పాలనుకున్నా. నేను గాయాలపాలైనప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. జట్టుకు ఎన్నో విజయాలు అందించిన నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందని బాధపడ్డా. నేను ఎవరి సాయం కోరను కానీ అప్పుడు నాకు అండగా ఒకరు ఉంటే బాగుండేదని అనిపించింది' అని అశ్విన్ (R Ashwin) భావోద్వేగం చెందాడు. యాష్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటన (IND vs SA)లో ఉన్నాడు. డిసెంబర్ 26న తొలి టెస్ట్ ఆరంభం కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook