Bengal Lost 6 Wickets for 65 in Ranji Trophy 2023 Final 1st Innings: దేశవాళీ అత్యున్నత టోర్నీ రంజీ ట్రోఫీ 2023 ఫైనల్ ఆరంభం అయింది. గురువారం ఉదయం ఈడెన్ గార్డెన్స్‌లో 9 గంటలకు మ్యాచ్ ఆరంభం అయింది. టాస్ గెలిచిన సౌరాష్ట్ర బౌలింగ్ ఎంచుకోవడంతో బెంగాల్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. సౌరాష్ట్ర పేసర్లు జయదేవ్ ఉనద్కత్, చేతన్ సకారియాలు చెలరేగడంతో బెంగాల్ 65 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. షాబాజ్ అహ్మద్, అభిషేక్ పోరెల్ జట్టును ఆదుకోవడంతో జట్టు స్కోర్ 100 దాటింది. ప్రస్తుతం బెంగాల్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. జయదేవ్ ఉనద్కత్, చేతన్ సకారియాలు చెలరేగడంతో బెంగాల్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఓపెనర్లు సుమంత గుప్తా (1), అభిమన్యు ఈశ్వరన్ (0) తక్కువ స్కోరుకే ఔట్ కాగా.. వన్ డౌన్ బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామి డకౌట్ అయ్యాడు. కెప్టెన్ మనోజ్ తివారీ (7), అనుస్తుప్ మజుందార్ (12), ఆకాష్ ఘటక్ (17) ఆదుకునే ప్రయత్నం చేసినా.. ఫలించలేదు. దాంతో బెంగాల్ 65 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ సయమంలో షాబాజ్ అహ్మద్, అభిషేక్ పోరెల్ జట్టును ఆదుకున్నారు. ఇద్దరు కలిసి బెంగాల్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్నారు. సింగిల్స్ తీస్తూనే.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలోనే 50కి పైగా రన్స్ బాదారు. ప్రస్తుతం బెంగాల్ జట్టు 40 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 124 రన్స్ చేసింది. షాబాజ్ అహ్మద్ (49), అభిషేక్ పోరెల్ (26)లు క్రీజులో ఉన్నారు. బెంగాల్ వీలైనంత ఎక్కువ పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తోంది.
1990లో చివరి సారిగా రంజీ ట్రోఫీలో విజేతగా నిలిచిన బెంగాల్.. 33 ఏళ్ల నిరీక్షకు తెరదించాలని చూస్తోంది. 2020లో రాజ్‌కోట్‌లో జరిగిన రంజీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్ ఆధారంగా బెంగాల్‌పై సౌరాష్ట్ర పైచేయి సాధించింది. ఆ పరాభవానికి సొంతగడ్డపై ప్రతీకారం తీర్చుకోవాలని బెంగాల్ భావిస్తోంది. 2019-20 సీజన్ నుంచి మెరుగ్గా ఆడుతున్న బెంగాల్.. మూడు సార్లు సెమీస్ చేరుకుని, రెండుసార్లు ఫైనల్స్ ఆడింది.
Also Read: Shreyas Iyer ComeBack: రెండో టెస్టులో శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ.. స్టార్ ప్లేయర్‌పై వేటు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.