వచ్చే ఏడాది నేనే వరల్డ్ నెం. 1: పీవీ సింధు

2016లో రియో ఒలంపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెల్చుకున్న హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు 2017లోనూ అంతర్జాతీయ స్థాయిలో పలు కీలక విజయాలు సొంతం చేసుకుని

Last Updated : Dec 28, 2017, 02:16 PM IST
వచ్చే ఏడాది నేనే వరల్డ్ నెం. 1:  పీవీ సింధు

2016లో రియో ఒలంపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెల్చుకున్న హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు 2017లోనూ అంతర్జాతీయ స్థాయిలో పలు కీలక విజయాలు సొంతం చేసుకుని ఒకానొక దశలో ప్రపంచంలో రెండో ర్యాంక్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా గుర్తింపు సాధించింది. ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో మూడో ర్యాంకులో కొనసాగుతున్న తాను వచ్చే ఏడాది వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ సొంతం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నానని పీవీ సింధు స్పష్టంచేసింది. అయితే, వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ కోసం తాను నిద్రకు దూరం కానని, కష్టపడి ఆడే ప్రతీ ఆట క్రీడాకారుల  ర్యాంకుని మెరుగుపర్చుకునేందుకు దోహదపడుతుందని ఆమె అభిప్రాయపడింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో భాగంగా బుధవారం రాత్రి న్యూఢిల్లీలోని సిరి ఫోర్ట్ స్పోర్ట్ కాంప్లెక్స్‌లో ముంబై రాకెట్స్ తరపున తలపడి చెన్నై స్మాషర్స్‌ని విజయ తీరాలకి చేర్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.

ఎప్పటికప్పుడు ఆడే టోర్నమెంట్స్‌లో క్రీడాకారులు కనబర్చే ప్రతిభపైనే వారి ర్యాంకింగ్స్ ఆధారపడి వుంటాయి. అటువంటప్పుడు తాను ఆడె ఆటపై శ్రద్ధవహిస్తే చాలు కానీ లక్ష్యం కోసం నిద్ర కరువయ్యేలా కష్టపడాల్సిన అవసరం లేదని సింధు అభిప్రాయపడింది.

Trending News