Obed McCoy: ఐపీఎల్‌లో అల్లు అర్జున్ 'పుష్ప' క్రేజ్... 'తగ్గేదేలా' అంటూ పోజిచ్చిన ఒబెడ్ మెక్కాయ్...

Obed McCoy Allu Arjun Pushpa Pose: పుష్ప సినిమా వచ్చి దాదాపు 4 నెలలైనా ఆ సినిమా క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గట్లేదు. తాజా ఐపీఎల్ సీజన్‌లోనూ ఐపీఎల్ క్రేజ్ కనిపిస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2022, 02:01 PM IST
  • ఐపీఎల్‌లో అల్లు అర్జున్ పుష్ప క్రేజ్
  • తగ్గేదెలా అంటూ పోజిచ్చిన బౌలర్ ఒబెడ్ మెక్కాయ్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Obed McCoy: ఐపీఎల్‌లో అల్లు అర్జున్ 'పుష్ప' క్రేజ్... 'తగ్గేదేలా' అంటూ పోజిచ్చిన ఒబెడ్ మెక్కాయ్...

Obed McCoy Allu Arjun Pushpa Pose: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో తెలిసిందే. ఈ సినిమాలోని మాటలు, పాటలు, మేనరిజమ్స్ ప్రేక్షకులను విపరీతంగా కనెక్ట్ అయ్యాయి. సినిమా వచ్చి దాదాపు నాలుగు నెలలు గడిచినా ఇప్పటికీ పుష్ప క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు పుష్పకు బాగా కనెక్ట్ అయిపోయారు. తాజా ఐపీఎల్ సీజన్‌లోనూ పుష్ప క్రేజ్ కనిపిస్తోంది.

రాజస్తాన్-కోల్‌కతా జట్ల మధ్య సోమవారం (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ బౌలర్ ఒబెడ్ మెక్కాయ్ పుష్ప మేనరిజమ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో తొలి వికెట్ సాధించిన మెక్కాయ్... ఆ సంతోషంలో 'తగ్గేదేలా..' అన్నట్లుగా అల్లు అర్జున్ స్టైల్లో పోజిచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్నటి మ్యాచ్‌లో మెక్కాయ్ రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

చివరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీయడంతో కేకేఆర్‌ గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు. చివరలో ఉమేశ్ యాదవ్ మెరుపులతో కేకేఆర్‌లో గెలుపు ఆశలు రేకెత్తినప్పటికీ మెక్కాయ్ బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్ ఔట్ అవడంతో కేకేఆర్ ఇన్నింగ్స్‌కి తెరపడింది. దీంతో 7 పరుగుల తేడాతో రాజస్తాన్‌ కేకేఆర్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేయగా... ఆ తర్వాత బ్యాటింగ్‌కి దిగిన కేకేఆర్ జట్టు 210 పరుగులకే కుప్పకూలింది. 

ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రాజస్తాన్ 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. కేకేఆర్ జట్టు ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. రాజస్తాన్ ఇప్పటివరకూ 6 మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో విజయం సాధించగా.. కేకేఆర్ 7 మ్యాచ్‌లు ఆడి మూడింట మాత్రమే విజయం సాధించింది. 

Also Read: Fourth Wave Scare: ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు, ఆ నగరాల్లో మాస్క్ ఇక తప్పనిసరి

Also Read: Golla Baburao: అవకాశం వచ్చినప్పుడు దెబ్బకొట్టి తీరుతా.. సీఎం జగన్‌కే వార్నింగ్ ఇస్తున్న వైసీపీ ఎమ్మెల్యే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News