IPL 2023 Auction: ఐపీఎల్ వేలంలో చరిత్ర సృష్టించిన సామ్‌ కరన్.. క్రిస్ మోరిస్, యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు!

Sam Curran Becomes Most Expensive Player in IPL History. ఐపీఎల్ వేలంలో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఆట‌గాడిగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ సామ్ కరన్‌ రికార్డు నెలకొల్పాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 23, 2022, 04:37 PM IST
  • ఆదిలోనే కావ్య పాప దూకుడు
  • హ్యారీ బ్రూక్‌కు రికార్డు ధర
  • కేన్‌ మామకు తీవ్ర నిరాశ
IPL 2023 Auction: ఐపీఎల్ వేలంలో చరిత్ర సృష్టించిన సామ్‌ కరన్.. క్రిస్ మోరిస్, యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు!

Sam Curran Becomes Most Expensive Player in IPL History: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ సామ్ కరన్‌ ఐపీఎల్ వేలంలో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ వేలంలో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఆట‌గాడిగా రికార్డు నెలకొల్పాడు. క‌ర‌న్‌ను పంజాబ్ కింగ్స్ ప్రాంచైజీ ఏకంగా రూ.18.50 కోట్ల‌కు ద‌క్కించుకుంది. దాంతో క్రిస్ మోరిస్ (16.25 crore), యువరాజ్ సింగ్ రికార్డు (16 crore) బద్దలు అయ్యాయి. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ 2022లో క‌ర‌న్‌ అదరగోట్టడంతోనే అతడికి ఈ జాక్‌పాట్ తగిలింది. మరోవైపు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్ గ్రీన్‌ కూడా మినీ వేలంలో భారీ ధర పలికాడు. ముంబై ఇండియన్స్ రూ. 17.50 కోట్లతో అతడిని దక్కించుకొంది.

ముందుగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్ పోటీ పడి సామ్ కరన్‌ ధరను పెంచాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కూడా మధ్యలో రావడంతో.. ఒక్కసారిగా మినీ వేలం వేడెక్కింది. చివరికి ముంబై, పంజాబ్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దాంతో కరన్ ఐపీఎల్ వేలంలో రికార్డు ధరను సొంతం చేసుకొన్నాడు. కరన్‌ను పంజాబ్‌ రూ.18.50 కోట్ల‌కు ద‌క్కించుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్‌ వేలంలో ఇదే అత్యధిక ధర. 2023 వేలంలో కరన్ భారీ ధ‌ర‌కు అమ్ముడుపోవడం ఖాయ‌మ‌ని ముందుగానే మాజీలు అభిప్రాయ‌ప‌డ్డారు. ఊహించిన‌ట్టుగానే క‌ర‌న్‌ జాక్‌పాట్ కొట్టాడు. 

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ 2022లో సామ్ క‌ర‌న్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఫైన‌ల్ మ్యాచులో 3 వికెట్లు తీసి పాకిస్థాన్‌ను దెబ్బ‌కొట్టాడు. ఆరు మ్యాచుల్లో 13 వికెట్లు ప‌డ‌గొట్టి.. ఇంగ్లండ్ కప్ అందుకోవడంలో కీల‌క పాత్ర పోషించాడు. అద్భుత ప్రదర్శనకు 'ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్' అవార్డును క‌ర‌న్ అందుకున్నాడు. వ‌ర‌ల్డ్‌క‌ప్‌ 2022 నుంచే క‌ర‌న్పై ప్రాంఛైజీలు కన్నేశాయి. గత సీజ‌న్‌లో క‌ర‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌ఫున ఆడాడు. ఈసారి వేలంలో అత‌డిని ద‌క్కించుకునేందుకు చెన్నై పోటీపడినా లాభం లేకపోయింది. 

ఐపీఎల్ వేలంలో అత్య‌ధిక ధ‌ర:
సామ్ క‌ర‌న్ - ₹18.5 కోట్లు
కామెరాన్ గ్రీన్ - ₹17.5 కోట్లు
క్రిస్ మోరిస్ - ₹16.25 కోట్లు
యువరాజ్ సింగ్ - ₹16 కోట్లు
పాట్ కమిన్స్ - ₹15.5 కోట్లు
ఇషాన్ కిషన్ - ₹15.25 కోట్లు
కైల్ జేమీసన్ - ₹15 కోట్లు

Also Read: Cheapest Electric Scooters: డెడ్ చీప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూ. 45 వేల నుంచి స్టార్ట్! 121 కిమీ ప్రయాణం  

Also Read: Harry Brook IPL 2023 Auction: ఆదిలోనే కావ్య పాప దూకుడు.. హ్యారీ బ్రూక్‌కు రికార్డు ధర! కేన్‌ మామకు తీవ్ర నిరాశ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News