Babar Azam Private Chat Leaked: ప్రపంచకప్ రేసులో వరుసగా ఓటములతో సెమీస్ రేసు నుంచి పాకిస్థాన్ టీమ్ తప్పుకుంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించినా.. ఆ తరువాత టీమిండియా చేతిలో ఓటమి తరువాత పూర్తిగా గాడి తప్పింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. ఇందులో అఫ్గానిస్థాన్ చేతిలో ఘోర ఓటమి కూడా ఉంది. దీంతో పాక్ టీమ్ ప్రదర్శనపై అన్ని వైపులా నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాబర్ అజామ్ కెప్టెన్సీపై కూడా భారీ ట్రోలింగ్ జరుగుతోంది. ఇంత చెత్త కెప్టెన్సీ అసలు చూడలేదని క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. వన్డేల్లో వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న బాబర్.. మెగా టోర్నీలో పెద్దగా ఆకట్టుకోలేదు. కెప్టెన్సీ నిర్ణయాలు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. ఫీల్డ్ సెటప్‌లో.. బౌలింగ్‌లో మార్పులు.. రివ్యూలు కోరడంలో బాబర్ ఏ మాత్రం ప్రభావం చూపించలేదనే మాజీలు ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాబర్ కెప్టెన్సీ ఊడిపోతుందని ప్రచారం జరుగుతోంది.
ఇలాంటి సమయంలో తాజాగా సంచలన విషయాలను బయటపెట్టారు ఆ దేశ మాజీ దిగ్గజ ఆటగాడు రషీద్ లతీఫ్. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా పీసీబీ ఛైర్మన్‌తో మాట్లాడేందుకు బాబర్ అజామ్ ప్రయత్నిస్తున్నాడని.. కానీ ఆయన మాట్లాడడం లేదని బాంబ్ పేల్చాడు. ఈ విషయంపై పీసీబీ ఛైర్మన్ జాకా అష్రాఫ్ క్లారిటీ ఇచ్చారు. బాబర్ తనను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నమే చేయలేదని స్పష్టం చేశారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌తోనే కెప్టెన్ మాట్లాడతారని.. తనతో కాదన్నారు.
ఓ ఛానెల్ లైవ్‌లో ఆయన మాట్లాడుతూ.. బాబర్, సల్మాన్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను లీక్ చేశారు. దీంతో లైవ్‌లో ఆ చాట్ టెలీకాస్ట్ అయింది. అసలే వరల్డ్ కప్‌లో వరస్ట్ పర్ఫామెన్స్‌తో విమర్శలు ఎదుర్కొంటుండగా.. తాజాగా వాట్సాప్ చాట్ లీక్ గందరగోళానికి గురి చేస్తోంది. వాట్సాప్ చాట్ లీక్ గోప్యతపై కూడా ఆందోళన కలుగుతోంది. ఇప్పటికే ఉన్న సమస్యలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. బాబర్ అజామ్ వంటి ఉన్నతస్థాయి వ్యక్తుల చాట్ బయటకు రావడం కలకలం రేపుతోంది.
They leaked Babar Azam’s private WhatsApp chats?
Pakistani players ko milta kya hai ko unse itni expectations rakhte ho? This is disgusting, he still has three matches to play in this World Cup pic.twitter.com/8eHSG2oygT— Sushant Mehta (@SushantNMehta) October 29, 2023
చాట్ లీక్ అవ్వడంపై టీవీ షో హోస్ట్ వసీం బాదామి విచారం వ్యక్తం చేశారు. ఛానెల్ తరపున బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కావడానికి కొద్ది క్షణాల ముందు.. అనుమతి లేకుండా చాట్‌ను ప్రసారం చేయాలనే నిర్ణయం తొందరపాటుతో తీసుకున్నట్లు అంగీకరించారు. వాట్సాప్ చాట్ లీక్ కావడాన్ని మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ ఖండించారు. బాబర్ అజామ్‌ను ఒంటరిగా వదిలేయాలని కోరారు. బాబర్ పాకిస్థాన్ క్రికెట్‌కు విలువైన ఆస్తిగా కొనియాడారు.
Also Read: Nara Lokesh: కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.. సీఎం జగన్ మోహన్ రెడ్డికి నారా లోకేష్ బహిరంగ లేఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి