Pakistan Poor Fielding: ఇదేం ఫీల్డింగ్ రా సామీ.. సింపుల్ క్యాచ్‌ను సిక్సర్‌ ఇచ్చారుగా! పాక్ ఫీల్డర్స్‌తో అట్లుంటది మరి

PAK vs SL Asia Cup 2022 Final. Pakistan Fielders Getting brutally Trolled For Poor Fielding. అలీ క్యాచ్ అందుకునే సమయానికి షాదాబ్‌ వచ్చి.. అతడిని ఢీకొట్టడంతో క్యాచ్ మిస్ అయింది. అంతేకాదు ఆ బంతి షాదాబ్‌ చేతులను తాకి ఏకంగా సిక్సర్‌ వెళ్ళింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 12, 2022, 12:15 PM IST
  • ఇదేం ఫీల్డింగ్ రా సామీ
  • సింపుల్ క్యాచ్‌ను సిక్సర్‌ ఇచ్చారుగా
  • పాక్ ఫీల్డర్స్‌తో అట్లుంటది మరి
Pakistan Poor Fielding: ఇదేం ఫీల్డింగ్ రా సామీ.. సింపుల్ క్యాచ్‌ను సిక్సర్‌ ఇచ్చారుగా! పాక్ ఫీల్డర్స్‌తో అట్లుంటది మరి

PAK vs SL Asia Cup 2022 Final. Pakistan Fielders Getting brutally Trolled For Poor Fielding: పాకిస్తాన్ క్రికెట్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో ఎప్పుడూ అత్యంత పటిష్టంగానే ఉంటుంది. పాక్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పట్నుంచి కూడా ఈ రెండు విభాగాల్లో పటిష్టంగా ఉన్నా.. ఫీల్డింగ్‌లో మాత్రం ఎప్పుడూ వెనకంజలోనే ఉంటుంది. సునాయాస క్యాచులు నేలపాలు చేయడం, ఒకరినొకరు చూసుకోవడం ద్వారా క్యాచ్ మిస్ కావడం లేదా క్యాచ్ తీసుకోవడానికి ప్రయత్నించి ఇద్దరు ప్లేయర్స్ ఢీకొనడం చేస్తుంటారు. క్రికెట్‌లో ఇది సహజమే అయినా పాక్ ఫీల్డర్స్‌ మాత్రం ఈ విషయంలో అన్ని జట్ల కంటే ముందుటారు. తాజాగా పాక్  ఫీల్డర్స్‌.. సింపుల్ క్యాచ్‌ను వదిలేయడమే కాకుండా సిక్సర్‌గా మార్చారు. ఈ ఘటన ఆసియా కప్‌ 2022 ఫైనల్లో చోటుచేసుకుంది.

ఆసియా కప్ 2022 ఫైనల్లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. ఓపెనర్లు కుశాల్‌ మెండిస్ (0), పాతుమ్ నిశాంక (8).. స్టార్ బ్యాటర్లు దనుష్క గుణతిలక (1), ధనంజయ డిసిల్వా (28).. కెప్టెన్ దాసున్ శనక (2) త్వరగానే పెవిలియన్ చేరారు. దాంతో 55 పరుగులకే కీలక 5 వికెట్లు కోల్పోయిన లంక పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్స (71 నాటౌట్‌; 45 బంతుల్లో 6×4, 3×6) వానిందు హసరంగ (36; 21 బంతుల్లో 5×4, 1×6)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 

19వ ఓవర్‌లోని చివరి బంతిని మహమ్మద్‌ హస్నైన్‌ వేయగా.. డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భానుక రాజపక్స భారీ షాట్‌కు ప్రయత్నించాడు. గాల్లో లేచిన బంతిని అందుకొనేందుకు అక్కడే ఉన్న ఫీల్డర్ అసిఫ్‌ అలీ ప్రయత్నిస్తుండగా.. అదే సమయంలో మరో ఫీల్డర్ షాదాబ్‌ ఖాన్‌ పరిగెత్తుకొంటూ వచ్చాడు. సరిగ్గా అలీ క్యాచ్ అందుకునే సమయానికి షాదాబ్‌ వచ్చి.. అతడిని ఢీకొట్టడంతో క్యాచ్ మిస్ అయింది. అంతేకాదు ఆ బంతి షాదాబ్‌ చేతులను తాకి ఏకంగా సిక్సర్‌ వెళ్ళింది. తనను అందరూ ఎక్కడ తిడతారో అని కాసేపు మైదానంలోనే హై డ్రామా చేశాడు. 

అసిఫ్‌ అలీ క్యాచ్‌ను వదిలేసినా.. రెండు పరుగులు మాత్రమే వచ్చేవి. పానకంలో పుడక లాగ మధ్యలో షాదాబ్‌ ఖాన్‌ దూరడంతో క్యాచ్ కాదుకదా.. సిక్సర్‌ వెళ్ళింది. ఆపై లంక చివరి ఓవర్లో 15 పరుగులు పిండుకుంది. లంక విజయంలో కీలక పాత్ర పోషించిన భానుక రాజపక్స ఇచ్చిన రెండు క్యాచ్‌లను పాక్ ఫీల్డర్లు వదిలేశారు. తొలి క్యాచ్‌ను షాదాబ్‌ ఖాన్‌ ఒంటరిగా వదిలేయగా.. రెండో క్యాచ్‌ను ఆసిఫ్‌ అలీ, షాదాబ్‌ కలిసి వదిలేశారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో నెటిజన్లు మీమ్స్, కామెంట్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇదేం ఫీల్డింగ్ రా సామీ, సింపుల్ క్యాచ్‌ను సిక్సర్‌ ఇచ్చారుగా, పాక్ ఫీల్డర్స్‌తో అట్లుంటది మరి, అప్పుడు ఇప్పుడు సేమ్ సీన్ అంటూ పేర్కొంటున్నారు. 

Also Read: ఆసియా కప్ 2022లో చెలరేగిన ఐదుగురు ప్లేయర్స్ వీరే.. విరాట్ కోహ్లీకి అత్యంత ప్రత్యేకమైనది!

Also Read: టీ20 ప్రపంచకప్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News