క్రైస్ట్ చర్చ్: రెండో టెస్టుకు ముందే టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన విరాట్ కోహ్లీ సేన రెండో టెస్టులో సత్తాచాటాలని భావించింది. కానీ జట్టులో కీలక ఆటగాడు, పేసర్ ఇషాత్ శర్మ గాయం కారణంగా వైదొలిగాడు. గురువారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొని నెట్‌లో బౌలింగ్ చేసిన ఇషాంత్.. శుక్రవారం ప్రాక్టీస్‌కు రాలేదు. కుడి చీలమండ నొప్పి కారణంగా తాను మ్యాచ్ ఆడలేనని టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఇషాంత్ స్పష్టం చేశాడని సమాచారం. దీంతో రెండో టెస్టులో టీమిండియా ఇషాంత్ లేకుండానే బరిలోకి దిగనుంది.
Also Read: 17ఏళ్లుగా నిరీక్షణ.. భారత్‌పై కివీస్‌దే ఆధిపత్యం
తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో రాణించిన ఇషాంత్ రెండో టెస్టుకు అందుబాటులో లేకపోవడం జట్టుకు పెద్ద దెబ్బ. ఇషాంత్ స్థానంలో ఉమేష్ యాదవ్, అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్న నవదీప్ సైనీలలో ఒకరు జట్టులోకి రానున్నారు. ఒకవేళ ఇద్దరికి అవకాశం ఇవ్వాలని మేనేజ్ మెంట్ భావిస్తే అశ్విన్‌ను తప్పించే అవకాశం ఉంది. మరోవైపు యువ సంచలనం పృథ్వీ షా గాయం నుంచి కోలుకున్నాడని రెండో టెస్టుకు సిద్ధంగా ఉన్నాడని హెడ్ కోచ్ రవిశాస్త్రి వెల్లడించాడు.
Also Read: క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు రాస్ టేలర్
టెస్టు ఛాంపియన్ షిప్‌లో 7 వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీ సేన ఇటీవల వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో దారుణ వైఫల్యాన్ని మూటగట్టుకుంది. కాగా, న్యూజిలాండ్ గడ్డ మీద ట్వంటీ20 సిరీస్ క్వీన్ స్వీప్ చేసిన భారత్.. వన్డే సిరీస్‌లో వైట్ వాష్‌కు గురైంది.
See Pics: టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వక ముందే మోడల్ రచ్చ రచ్చ
Also Read: భారత్‌కు మరో పరాభవం.. టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో తొలి దెబ్బ