NZ Vs NED: అంతర్జాతీయ క్రికెట్ కు స్టార్ ప్లేయర్ గుడ్ బై.. చివరి మ్యాచ్ లో భావోద్వేగానికి గురైన రాస్

రెండు దశాబ్ధాలపాటు జట్టుకు ఆడిన స్టార్ ప్లేయర్ రాస్ టేలర్‌ అన్ని ఫార్మేట్లకు గుడ్‌బై చెప్పేసాడు. ఈ సందర్భంగా నెదర్లాండ్ తో జరుగుతున్న తన చివరి మ్యాచ్ లో భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 4, 2022, 05:26 PM IST
  • న్యూజిలాండ్ క్రికెట్‌లో ముగిసిన ఓ శకం
  • క్రికెట్‌కు రాస్ టేలర్ గుడ్‌బై
  • చివరి మ్యాచ్‌లో తీవ్ర భావోద్వేగానికి గురైన టేలర్
NZ Vs NED: అంతర్జాతీయ క్రికెట్ కు స్టార్ ప్లేయర్ గుడ్ బై.. చివరి మ్యాచ్ లో భావోద్వేగానికి గురైన రాస్

Ross Taylor Retirement: న్యూజిలాండ్ క్రికెట్‌లో ఓ ఘట్టం ముగిసింది. దాదాపు రెండు దశాబ్ధాలపాటు జట్టుకు ఆడిన స్టార్ ప్లేయర్ రాస్ టేలర్‌ గుడ్‌బై చెప్పాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. నెదర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 16 బంతులను ఎదుర్కొని 14 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. కెరీర్‌లో అతడికి ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఆఖరి ఇన్నింగ్స్‌ ఆడేందుకు బరిలోకి దిగిన టేలర్‌కు నెదర్లాండ్స్‌ ఆటగాళ్లు గార్డ్ ఆఫ్‌ హానర్‌తో స్వాగతం పలికారు. 

మ్యాచ్‌ ఆరంభానికి ముందు జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనైయ్యాడు. దుఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు.  దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  టీమ్‌కు టేలర్ చేసిన సేవలను కివీస్ ఆటగాళ్లు గుర్తు చేసుకున్నారు. ఈ మ్యాచ్‌కు టేలర్ కుటుంబసభ్యులు హాజరైయ్యారు.

2006లో  రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగ్రేటం చేశాడు. న్యూజిలాండ్ తరపున 112 టెస్ట్‌లు, 236 వన్డేలు, 102 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్ట్‌ల్లో 44.16 సగటున 3 డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు చేశాడు. మొత్తం 7 వేల 384 పరుగులు సాధించాడు. వన్డేల్లో 47.52 సగటుతో 21 సెంచరీలు, 51 హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు. వన్డేల్లో మొత్తం 8 వేల 602 పరుగులు చేశాడు.  టీ20ల్లో 7 హాఫ్‌ సెంచరీలతో 19 వందల 9 పరుగులు సాధించాడు. టేలర్ జాతీయ జట్టు తరపునే కాకుండా ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 55 మ్యాచ్‌ల్లో 3 హాఫ్‌ సెంచరీలు చేశాడు. మొత్తం  వెయ్యి 17 పరుగులు స్కోర్ చేశాడు. 

Also Read: Actress Kushitha: పబ్ ఓపెన్ ఉంది కాబట్టే చిల్ అవడానికి వెళ్లాం... దయచేసి దుష్ప్రచారం వద్దు..

Also Read: Rajat Patidar: బెంగళూరుకు ఎదురుదెబ్బ.. కీలక ఆటగాడు దూరం! పాటిదార్‌ వచ్చేశాడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News