New Zealand Squad: వెరైటీగా వరల్డ్ కప్‌ టీమ్‌ ప్రకటన.. మనసుకు హత్తుకునే వీడియో..!

New Zealand Squad For World Cup 2023: ప్రపంచ కప్‌కు న్యూజిలాండ్ తమ టీమ్‌ను ప్రకటించింది. కేన్ విలియమ్సన్ గాయం నుంచి కోలుకోవడంతో తిరిగి జట్టులోకి వచ్చి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. 15 మంది టీమ్‌ సభ్యుల పేర్లను వాళ్ల కుటుంబ సభ్యులే ప్రకటించారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 11, 2023, 10:44 PM IST
New Zealand Squad: వెరైటీగా వరల్డ్ కప్‌ టీమ్‌ ప్రకటన.. మనసుకు హత్తుకునే వీడియో..!

New Zealand Squad For World Cup 2023: భారత్ వేదిక అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ప్రపంచ కప్ 2023కు అన్ని జట్లు అస్త్రశస్త్రలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే వరల్డ్ కప్‌లో దిగే జట్లను ప్రకటించాయి. న్యూజిలాండ్ కూడా తమ టీమ్‌ను వెల్లడించింది. అయితే అందరిలాగా సాదాసీదాగా జట్టును ప్రకటిస్తే ఏం కిక్ ఉంటుందనుకుంది కివీస్ క్రికెట్ బోర్డు. ప్లేయర్ల కుటుంబ సభ్యులతోనే జట్టును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. కాగా 2019 వరల్డ్ కప్‌లో కివీస్ జట్టు రన్ననప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌ పోరులో ఇంగ్లాండ్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. తొలిసారి విశ్వకప్‌ ముద్దాడాలని బరిలోకి దిగుతోంది. 
 
'మా క్రికెట్ ప్రపంచ కప్ జట్టును వారి నంబర్ వన్ అభిమానితో పరిచయం చేస్తున్నాం' అని బ్లాక్ క్యాప్స్ వీడియోను షేర్ చేసుకుంది. ఈ వీడియోలో న్యూజిలాండ్ ఆటగాళ్ల కుటుంబ సభ్యులు తమ జెర్సీ నంబర్‌లతో తమ ప్లేయర్లను పరిచయం చేశారు. ఈ వీడియో మనసు హత్తుకుంటోంది. కేన్ విలియమ్సన్ కుటుంబం, ట్రెంట్ బౌల్ట్ కుమారుడు, రచిన్ రవీంద్ర తల్లిదండ్రులు జిమ్మీ నీషమ్ అమ్మమ్మ వీడియోలో కనిపించారు.

 

ఈ ఏడాది ఐపీఎల్‌లో గాయం కారణంగా క్రికెట్‌కు దూరమైన కేన్ విలియమ్సన్ తిరిగి జట్టులో ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లోనే విలియమ్స్ బౌండరీ లైన్ వద్దగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. గాయం నుంచి కోలుకుని కేన్ మామ జట్టులోకి వచ్చేశాడు. ట్రెంట్ బౌల్ట్ కూడా చాలా రోజుల తరువాత జట్టులోకి తిరిగి వచ్చాడు. విలియమ్సన్ నేతృత్వంలో 15 మంది ఆటగాళ్లతో టీమ్‌ను ప్రకటించింది న్యూజిలాండ్.
 
ప్రపంచకప్‌కు కివీస్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వైస్ కెప్టెన్), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, విల్ యంగ్.

Also Read: IND Vs PAK Match Updates: పాక్ బౌలర్లకు టీమిండియా చుక్కలు.. సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్  

Also Read: Indian Railways: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రేపు ఈ మార్గంలో విస్టాడోమ్ ట్రైన్ ప్రారంభం  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News