Gavaskar Controversy: షేన్‌వార్న్‌పై గవాస్కర్ వ్యాఖ్యలకు మండిపడుతున్న నెటిజన్లు

Gavaskar Controversy: ఆస్ట్రేలియన్ స్పిన్ మాంత్రికుడు షేన్‌వార్న్ మరణం క్రికెట్ ప్రపంచానికి తీరనిలోటు. ప్రపంచమంతా నివాళులర్పిస్తుంటే..టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 7, 2022, 03:08 PM IST
 Gavaskar Controversy: షేన్‌వార్న్‌పై గవాస్కర్ వ్యాఖ్యలకు మండిపడుతున్న నెటిజన్లు

Gavaskar Controversy: ఆస్ట్రేలియన్ స్పిన్ మాంత్రికుడు షేన్‌వార్న్ మరణం క్రికెట్ ప్రపంచానికి తీరనిలోటు. ప్రపంచమంతా నివాళులర్పిస్తుంటే..టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది.

షేన్‌వార్న్. క్రికెట్ ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. 52 ఏళ్ల వయస్సులో తీవ్ర గుండెపోటుతో ఇటీవల మరణించడం క్రికెట్ ప్రపంచానికి షాక్ కల్గించింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, క్రికెటర్లు నివాళి అర్పిస్తున్నారు. టీమ్ ఇండియా క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ తదితరులు తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆస్ట్రేలియా టీమ్‌కు , ఐపీఎల్‌కు అతనందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఇంకా అంత్యక్రియలు కూడా పూర్తి కాలేదు. ఈలోగా టీమ్ ఇండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సాటి క్రికెటర్ అనే కన్సర్న్ లేకుండా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అది కూడా ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించిన సంతాపసభ కార్యక్రమంలో. 

షేన్‌వార్న్ గొప్ప స్పిన్నర్ కాదని..సామాన్య స్పిన్నర్ అని కామెంట్ చేయడం క్రికెట్ అభిమానులు ఆగ్రహం తెప్పించింది. షేన్‌వార్న్ ఆల్ టైమ్ గ్రేట్ స్పిన్నర్ అంటే ఒప్పుకోనని..అతనికంటే ఇండియాలో గొప్ప స్పిన్నర్లు ఉన్నారని..ముత్తయ్య మురళీధరన్ కూడా గొప్ప స్పిన్నర్ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.షేన్‌వార్న్‌కు భారత ఉపఖండం పిచ్‌లపై సరైన రికార్డులు కూడా లేవన్నాడు. కేవలం ఓ సాధారణ స్పిన్నర్‌గానే ప్రదర్శన ఇచ్చాడన్నాడు. ఇక నాగ్‌పూర్‌లో జరిగిన టెస్టులో ఐదు వికెట్లు తీయడం కూడా జహీర్ ఖాన్ అనవసర షాట్‌కు ప్రయత్నించి అవుటవడమే కారణమన్నాడు. అందుకే ఐదు వికెట్లు లభించాయని చెప్పాడు. షేన్‌వార్న్ ఇండియాలో పెద్దగా రాణించలేదని..అతనితో పోలిస్తే..అనిల్ కుంబ్లే, ముత్తయ్య మురళీధరన్‌లు స్వదేశంలోనే కాకుండా విదేశీ గడ్డపై కూడా రాణించారన్నాడు. అందుకే తన దృష్టిలో షేన్‌వార్న్ గొప్ప కాదన్నాడు. 

ఈ వ్యాఖ్యలపైనే ఇప్పుడు క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. చనిపోయిన తరువాత ఇలాంటి కామెంట్లు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. కామెంట్లు చేయడానికి సమయం, సందర్భం తెలియదా అని విమర్శిస్తున్నారు. షేన్‌వార్న్ గౌరవం ఇవ్వకపోయినా..క్రికెట్ ప్రపంచానికి అందించిన సేవలకు విలువిచ్చుంటే బాగుండేదంటున్నారు నెటిజన్లు. భారత స్పిన్నర్లతో పాటు ముత్తయ్య మురళీధరన్ మంచి స్పిన్నర్లని చెప్పుకునేందుకు షేన్‌వార్న్ మరణాన్ని వాడుకుంటున్నారా అంటూ మండిపడుతున్నారు. విమర్శలు చేసేందుకు సమయం, సందర్భం ఉంటాయని..ఇది మంచి పద్ధతి కాదని హితవు పలుకుతున్నారు.

Also read: Ronaldo Bathing Video: వైరల్ అవుతున్న ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ రొనాల్డో బహిరంగ అర్ధనగ్న స్నానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News