Robin Singh backs Rohit Sharma: కష్టకాలంలో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లకు రాబిన్ సింగ్ మద్దతు

Robin Singh backs Rohit Sharma: ముంబై ఇండియన్స్ తన ఐపీఎల్ కేరీర్‌లోనే అత్యంత చెత్త ప్రదర్శన ఈ సీజన్‌లో చేస్తోంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో రోహిత్ సేన 8 మ్యాచులు ఆడితే అన్నింట్లో కూడా ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో చిట్టచివరిన ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 12:06 AM IST
  • ముంబై ఇండియన్స్ జట్టును వెంటాడుతున్న వరుస వైఫల్యాలు
  • రాణించలేకపోతున్న ఓపెనర్స్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్
  • తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఓపెనర్లకు బ్యాటింగ్ కోచ్ నుంచి మద్దతు
Robin Singh backs Rohit Sharma: కష్టకాలంలో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లకు రాబిన్ సింగ్ మద్దతు

Robin Singh backs Rohit Sharma: ముంబై ఇండియన్స్ తన ఐపీఎల్ కేరీర్‌లోనే అత్యంత చెత్త ప్రదర్శన ఈ సీజన్‌లో చేస్తోంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో రోహిత్ సేన 8 మ్యాచులు ఆడితే అన్నింట్లో కూడా ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో చిట్టచివరిన ఉంది. అయితే జట్టులో ముఖ్యంగా ఓపెనింగ్ పార్టనర్‌షిప్ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీనిపై నెట్టింట తెగ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఎన్నో అంచనాలతో అడుగుపెట్టిన ముంబై ఇండియన్స్ పరిస్థితి మాత్రం ఘోరంగా ఉందనే చెప్పుకోవాలి.  ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్న కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు లెఫ్ట్ హ్యాండర్ అయిన ఇషాన్ కిషాన్ ఈసారి రాణించలేకపోతున్నారు. 

ఇప్పటివరకు రోహిత్ శర్మ 8 మ్యాచులు ఆడి కేవలం 153 పరుగులు మాత్రమే చేశాడు. అందులో వ్యక్తిగత అత్యధిక స్కోరు 41 మాత్రమే. అటు ఇషాన్ కిషాన్ కూడా 8 మ్యాచులు ఆడి 199 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో టాప్ స్కోర్ 81 రన్స్. ఢిల్లీతో  జరిగిన మ్యాచ్‌లోనే ఈ వ్యక్తిగత అత్యధిక స్కోరు నమోదు చేశాడు.  ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఇషాన్ 54 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత నుంచి కోల్‌కతాపై 14 పరుగులు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 26 పరుగులు, పంజాబ్ జట్టుపై 3 పరుగులు, లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగులు, చెన్నైపై 0, లక్నోపై 8 పరుగులు మాత్రమే చేశాడు.

ఇషాన్ కిషాన్‌ని ముంబై 15.25 కోట్లు వెచ్చించి మరి కొనుగోలు చేసింది. మరి అలాంటి ఆటగాడు తొలి రెండు మ్యాచులు ఆడి మిగతా మ్యాచుల్లో ఇంత చెత్తగా ఆడుతాడా అని ముంబై ఇండియన్స్ (Mumbai Indians) అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. వాటన్నింటికి తెరదించుతూ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ రాబిన్ సింగ్.. వారిద్దరిని వెనుకేసుకొచ్చాడు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషాన్.. గురించి సానుకూలంగానే ఉన్నాడు. మిగతా మ్యాచుల్లో కచ్చితంగా అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారని రాబిన్ సింగ్ ధీమా వ్యక్తంచేయడం గొప్ప విషయం.

Also read :  Sachin Tendulkar Net Practice: దాదాపు 9 ఏళ్ల తర్వాత సచిన్ నెట్స్ లో ప్రాక్టీస్..!!

Also read : Rishabh Pant on No Ball Issue: మరోసారి నో బాల్ హైడ్రామా సృష్టించిన రిషభ్ పంత్, జరిమానా తప్పదా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News