మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కారణంగానే తన కుమారుడు యువరాజ్ సింగ్ (Yuvraj Singh) కెరీర్ నాశనమైందంటూ యువీ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ తరచుగా వ్యాఖ్యానించడం తెలిసిందే. 2019 వరల్డ్ కప్‌నకు ఎంపిక కాకపోవడం, ధోనీ మద్దతు విషయాలపై మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ పలు ఆసక్తికర విషయాలు (Yuvraj About MS Dhoni) షేర్ చేసుకున్నాడు. ధోనీపై తనకు ఎలాంటి ఫిర్యాదులు లేవన్నాడు. ధోనీ తనను జట్టులో కీలక ఆటగాడు అని పలుమార్లు చెప్పినట్లు తెలిపాడు. IPL 2020: ఎంఎస్ ధోనీ చెన్నై టీమ్ రె‘ఢీ’..
‘జట్టులోకి పునరాగమనం చేసినప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతు తెలిపాడు. కానీ జట్టులోకి రాకపోతే కోహ్లీ సహకారం ఉండేది కాదు. కానీ ధోనీ మాత్రం వాస్తవాన్ని నాకు చెప్పేశాడు. 2019 వరల్డ్ కప్ గురించి ఎదురుచూస్తున్నాను. సెలక్టర్లు నిన్ను తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని ధోనీ నాతో అన్నాడు. ధోనీ చేయాల్సింది చేశాడు. కానీ లాభం లేకపోయింది’ అని న్యూస్ 18తో మాట్లాడుతూ యువీ ఈ విషయాలు వెల్లడించాడు. IPL 2020: క్రికెటర్ల వెంట లవర్స్, బీసీసీఐ దారెటు?
2011 వరల్డ్ కప్ వరకు ధోనీకి నాపై చాలా నమ్మకం ఉండేదన్నాడు. కానీ క్యాన్సర్‌ను జయించిన తర్వాత ఫామ్ కోల్పోయానని, రంజీలలో వరుసగా మూడు సెంచరీలు చేసి సత్తా చాటినా 2015 ప్రపంచ కప్‌లో తనకు అవకాశం రాలేదని గుర్తు చేశాడు. అయితే కెప్టెన్ ప్రతి ఒక్క ఆటగాడికి న్యాయం చేయలేడని, ధోనీపై తనకు ఎలాంటి ఫిర్యాదులు లేవని ఈ సందర్భంగా యువరాజ్ వివరించాడు. చోటు దక్కకపోవడంతో గతేడాది వరల్డ్ కప్ జరుగుతుండగా క్రికెట్‌కు యువరాజ్ వీడ్కోలు పలకాడు. BCCI: అవమానించినా ఆశ్చర్యపోలేదు: యువరాజ్ సింగ్
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...
MS Dhoni ఆ విషయాన్ని ముందే చెప్పాడు: యువీ