ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెబుతున్నట్టు టీమిండియా లెజెండరీ మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni ) ఇటీవల చేసిన ప్రకటన క్రికెట్ ప్రియుల అందరి దృష్టిని ఆకర్షించింది. ఎంతోమంది ధోని అభిమానులను ఆవేదనకు గురి చేసిన రిటైర్మెంట్ ప్రకటనపై ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు ఇంకా స్పందిస్తూనే ఉన్నారు. అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీకి ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) సైతం ఓ లేఖ రాశారు. 'టీమిండియాకు ధోనీ అందించిన సేవలను ( MS Dhoni services ) గుర్తుచేసుకుంటూ ధోనీని అభినందించిన ప్రధాని మోదీ.. క్రికెట్లో ఉత్తమ కెప్టెన్‌గా, ఉత్తమ వికెట్ కీపర్‌గా ధోనీ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది అని ప్రశంసల్లో ముంచెత్తారు. ధోనీ భవిష్యత్తు మరింత ఆశాజనకంగా ఉండాలి' అని ఆశిస్తున్నట్టు ధోనికి రాసిన లేఖలో ప్రధాని తన ఆకాంక్షను వ్యక్తపరిచారు. Also read : Jobs in ECIL: బీటెక్ పాసయ్యారా ? ఈ జాబ్ నోటిఫికేషన్ చూడండి
An Artist,Soldier and Sportsperson what they crave for is appreciation, that their hard work and sacrifice is getting noticed and appreciated by everyone.thanks PM @narendramodi for your appreciation and good wishes. https://t.co/T0naCT7mO7
— Mahendra Singh Dhoni (@msdhoni) August 20, 2020
ప్రధాని మోదీ ( PM Modi's letter to MS Dhoni ) రాసిన లేఖకు ధోనీ స్పందిస్తూ.. 'కళాకారులు, సైనికులు, క్రీడాకారులు తపించేది ఎదుటివారి అభినందన కోసమే అని అభిప్రాయపడ్డారు. తాము పడిన కష్టం, చేసిన త్యాగాలకు తగిన గుర్తింపు దక్కాలనే వారు కోరుకునేది. అలాగే తనను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు' ప్రధాని మోదీకి ట్విట్టర్ ( MS Dhoni tweets ) ద్వారా ధోని రిప్లై ఇచ్చాడు. Also read : Kormo jobs app: ఉద్యోగం కావాలా ? ఈ మొబైల్ యాప్ ట్రై చేయండి అంటున్న గూగుల్