MS Dhoni: రాంచీ స్టేడియంలో ఎంఎస్ ధోనీ ప్రాక్టీస్

MS Dhoni practice in Ranchi | భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2020 కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తమ ఆరాధ్య క్రికెటర్ ధోనీని స్టేడియంలో చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. ధోనీ హెలికాప్టర్‌ షాట్‌లు చూసేందుకు సిద్ధమా అంటూ స్పందిస్తున్నారు.

Last Updated : Aug 7, 2020, 07:14 PM IST
  • ఏడాదిన్నర నుంచి భారత జట్టుకు దూరం
  • ఐపీఎల్ 2020 సన్నాహకాలు మొదలు
  • చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రాక్టీస్ మొదలైంది
  • సొంత స్టేడియం జార్ఖండ్‌లో బ్యాటింగ్ సాధన
MS Dhoni: రాంచీ స్టేడియంలో ఎంఎస్ ధోనీ ప్రాక్టీస్

గతేడాది వన్డే ప్రపంచ కప్‌లో సెమిఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) జట్టుకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2020 (IPL 2020) సన్నాహకాలు జోరుగా సాగుతున్న క్రమంలో మహేంద్రుడు మళ్లీ బ్యాట్ పట్టాడు. జార్ఖండ్ డైనమైట్‌గా పేరున్న ధోనీ.. తన సొంత స్టేడియం రాంచీలో ప్రాక్టీస్ (MS Dhoni Practice) మొదలుపెట్టేశాడు. గత వారం జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియానికి వచ్చి పరిస్థితులు గమనించి వెళ్లిపోయిన ధోనీ నేడు నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. IPL ఫ్రాంచైజీలకు బీసీసీఐ కీలక ఆదేశాలు

లాక్‌డౌన్ సమస్యల కారణంగా నాణ్యమైన బౌలర్ల కొరతతో బౌలింగ్ మెషీన్ల సాయంతో ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ సాధన చేశాడని స్టేడియం అధికారులు వెల్లడించారు. గతంలో రెగ్యూలర్‌గా ప్రాక్టీస్ కోసం వచ్చే లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి కారణాలతో కొంతకాలం నుంచి ప్రాక్టిస్ చేయలేదు. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మాత్రం ధోనీని తిరిగి మైదానంలో చూడబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. Rohit Sharma: ముంబై జట్టులో రోహిత్‌కు అతి తక్కువ ప్రాధాన్యం

ఐపీఎల్‌కు తాము రెడీ అంటూ ఫొటోలు పెట్టడం ధోనీ అభిమానులకు పండగలా అనిపించింది. త్వరలోనే యూఏఈ స్టేడియాలలో ధోనీ హెలికాప్టర్ షాట్‌లు చూడబోతున్నామంటూ క్రికెట్ ప్రేమికులు, చెన్నై జట్టు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఏడాదిన్నర తర్వాత ధోనీ మ్యాచ్‌లు ఆడబోతున్నాడనేది క్రికెట్ వర్గాలలో హాట్ టాపిక్ అవుతోంది. MS Dhoni ఆ విషయాన్ని ముందే చెప్పాడు: యువరాజ్ సింగ్ 
BCCI: అవమానించినా ఆశ్చర్యపోలేదు: యువరాజ్ సింగ్ 

 
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...

Trending News