MS Dhoni knows Fans Created DRS Full-Form says Suresh Raina: డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్‌ఎస్) అంటే తెలియని వారు ఉంటారేమో కానీ.. 'ధోనీ రివ్యూ సిస్టమ్' అంటే తెలియని సగటు క్రికెట్ అభిమాని ఉండదు. 'డీఆర్‌ఎస్ అంటే ధోనీ'.. 'ధోనీ అంటే డీఆర్‌ఎస్' అందంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన ధోనీ.. ఎల్బీడబ్ల్యూలను కచ్చితంగా అంచనా వేయడంలో దిట్ట. ధోనీ రివ్యూ తీసుకున్నాడంటే. అది కచ్చితంగా ఔట్ అని అంపైర్, ఆటగాడితో పాటు అభిమానులు కూడా ఫిక్సయిపోతారు. ఇలాంటి వాటిని మనం ఎన్నో మైదానంలో మన కళ్లారా చూశాం.
డీఆర్‌ఎస్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఉన్న అపారమైన పరిజ్ఞానం గురించి భారత మాజీ ఆటగాడు, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా స్పందించాడు. డీఆర్‌ఎస్‌ని ధోనీ రివ్యూ సిస్టమ్ అని ఫాన్స్ పిలుస్తారనే విషయం మహీకి కూడా తెలుసని రైనా తెలిపాడు. సౌతాఫ్రికా టీ20 సందర్భంగా వయాకామ్18 స్పోర్ట్స్ ప్రతినిధితో సురేష్ రైనా, టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా మాట్లాడారు. ఈ సందర్భంగా డెసిషన్ రివ్యూ సిస్టమ్ గురించి టాపిక్ రాగా.. రైనా స్పందించాడు.
'డీఆర్‌ఎస్‌ని ధోనీ రివ్యూ సిస్టమ్‌గా ఫాన్స్ పిలుస్తారనే విషయం ఎంఎస్ ధోనీకి తెలుసు. డీఆర్‌ఎస్ అనగానే నాక్కూడా అదే పేరు గుర్తొస్తుంది. ఆ తర్వాతే దాని అసలు పేరు (డెసిషన్ రివ్యూ సిస్టమ్) తెలుసుకున్నా. ధోనీ ఎప్పుడూ రివ్యూని చివరి క్షణంలో తీసుకుంటాడు. ఎందుకంటే.. బౌలర్ అది కచ్చితంగా ఔట్ అని భావిస్తాడు. కానీ వికెట్ల వెనక ఉండే మహీకి మూడు స్టంప్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే ధోనీ సరైన నిర్ణయం తీసుకుంటాడు. చాలాసార్లు సక్సెస్ అయ్యాడు' అని సురేష్ రైనా చెప్పాడు.
భారత్ మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా మాట్లాడుతూ... వికెట్ కోసం ఎంఎస్ ధోనీ అప్పీల్ చేశాడా లేదా అనే విషయాన్ని అంపైర్లు గమనిస్తారన్నాడు. ధోనీ అప్పీల్ చేశాడా? లేదా? అని అంపైర్లు గమనిస్తారని తాను భావిస్తున్నానన్నాడు. మహీ అప్పీల్ చేశాడంటే అది కచ్చితంగా ఔట్ అని ఓజా అన్నాడు. ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. భారత జట్టుతో పాటు చెన్నై తరఫున ఈ ఇద్దరు కలిసి చాలా ఏళ్లుగా ఆడారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.