న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్ల కుటుంబాలకు టీమిండియా క్రికెటర్ మహ్మాద్ షమీ రూ 5 లక్షల విరాళం ప్రకటించాడు. అందుకు సంబంధించిన చెక్‌ను సీఆర్పీఎఫ్ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు షమి అందజేశాడు. తామంతా దేశం కోసం ఆడుతుంటే, జవాన్లు దేశ సరిహద్దుల్లో ఉండి దేశాన్ని రక్షిస్తున్నారని, అటువంటి వారి కుటుంబాలకు తాము ఎప్పుడూ అండగా నిలబడతామని షమి స్పష్టంచేశాడు.
Delhi: Cricketer Mohd Shami donates money to the wives of CRPF Jawans who lost their lives in #PulwamaTerrorAttack; says, “When we play for our country they stand at the borders protecting it. We stand with the families of our jawans, we will always be there for them." pic.twitter.com/yP4tRe07lb
— ANI (@ANI) February 18, 2019
ఇదిలావుంటే, విధి నిర్వహణలో వుంటూ ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ ప్రముఖుల నుంచి భారీ ఎత్తున సానుభూతి వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలువురు భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించగా.. ఇంకొందరు వారి కుటుంబాలను దత్తత తీసుకుని, వారి పిల్లల చదువులకు అయ్యే ఖర్చులను భరించేందుకు ముందుకొస్తున్నారు.