Mohammed Siraj: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. లార్డ్స్ టెస్టులో సిరాజ్(Mohammed Siraj) రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 8 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. స్వతహాగా దూకుడుగా కనిపించే సిరాజ్‌కు కోపం కూడా ఎక్కువే ఉంటుంది. ప్రత్యర్థి ఆటగాళ్లు ఎవరైనా టార్గెట్ చేస్తే వారికి ధీటుగా బదులిస్తుంటాడు.
తాజాగా ఇంగ్లండ్(England)తో లీడ్స్(Leads) వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో సిరాజ్(Mohammed Siraj)ను టార్గెట్ చేస్తూ.. ఇంగ్లండ్ అభిమానులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ఆలౌట్ అయిన తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ మొదటి వికెట్ తీసేందుకు భారత బౌలర్లు శ్రమిస్తున్నారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్‌ని ఇంగ్లండ్ ఫ్యాన్స్ గేలి చేసే ప్రయత్నం చేశారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్‌ని ఉద్దేశించి స్టాండ్స్‌లోని అభిమానులు ‘‘సిరాజ్ స్కోర్ ఎంత..?’’ అంటూ వెటకారంగా అడిగారు. అయితే.. సిరాజ్ వారికి దిమ్మదిరిగే రిప్లై ఇచ్చాడు. అభిమానుల వైపు చూస్తూ ‘‘1-0’’ అని సిగ్నల్ ఇచ్చాడు. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో భారత్ జట్టు(TeamIndia) ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది.
Mohammed Siraj signalling to the crowd “1-0” after being asked the score.#ENGvIND pic.twitter.com/Eel8Yoz5Vz
— Neelabh (@CricNeelabh) August 25, 2021
Also Read: నిప్పులు చెరిగిన ఇంగ్లాండ్ బౌలర్లు...నిలబడలేకపోయిన భారత్ బ్యాట్స్‌మెన్
మూడో టెస్టు(Third Test)లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా 40.4 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ శర్మ (105 బంతుల్లో 19; 1 ఫోర్) టాప్ స్కోరర్ కాగా, అండర్సన్ వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ ఆట నిలిచే సమయానికి 42 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. బర్న్స్ (52 ), హమీద్ (60 ) క్రీజులో ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook