మొహమ్మద్ షమీ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేసిన ధోనీ

షమీ భార్య హసిన్ జహాన్ అతడిపై గృహ హింస కేసు పెట్టిన నేపథ్యంలో ఈ వివాదంపై స్పందించిన ధోనీ ఏమన్నా తెలుసా ? 

Last Updated : Mar 12, 2018, 07:53 PM IST
మొహమ్మద్ షమీ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేసిన ధోనీ

భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి టీమిండియా మాజీ కెప్టేన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ నుంచి మద్ధతు లభించింది. షమీ తన భార్యను, దేశాన్ని మోసం చేసే రకం కాదు అని మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. మార్చి 9వ తేదీన షమీ భార్య హసిన్ జహాన్ అతడిపై గృహ హింస కేసు పెట్టిన నేపథ్యంలో షమీ తీవ్ర ఇరకాటంలో పడ్డాడు. షమీపై వస్తున్న అనేక ఆరోపణలపై నిన్నటివరకు పెదవి విప్పని ధోనీ.. తాజాగా ఓ ప్రముఖ దిన పత్రికతో మాట్లాడుతూ.. షమీని వెనకేసుకొచ్చాడు. షమీ తన భార్య హసిన్ జహాన్‌ని కానీ దేశాన్ని కానీ మోసం చేసే వ్యక్తి కాడు. అది అతడి వ్యక్తిగత వివాదం. ఆ వివాదంపై వ్యాఖ్యానించడం సరికాదు అని అభిప్రాయపడ్డాడు. తనని మోసం చేసిన షమీ దేశాన్ని సైతం మోసం చేయడానికి వెనుకాడే వ్యక్తి కాదు అని హసీన్ జహాన్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ ధోనీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఎం.ఎస్. ధోనీ కెప్టెన్సీలో పేసర్‌గా మొహమ్మద్ షమీ టీమిండియా జట్టులోకి ప్రవేశించాడు.

ఇదిలావుంటే, మొహమ్మద్ షమీకి దేశవ్యాప్తంగా ఎంతో మంది మహిళలతో అక్రమ సంబంధాలు వున్నాయని, తనకన్నా ముందే పాకిస్థాన్ కి చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడని ఆరోపించిన షమీ భార్య హసిన్ జహాన్ అతడిపై, అత్తింటివారిపై గృహ హింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇవే అంటూ ఆమె షమీకి చెందిన చాటింగ్ స్రీన్ షాట్స్‌ని సైతం పోలీసులతో పంచుకున్నారు. 

Trending News