Mithali Raj Records: టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనత, మహిళల క్రికెట్‌లో కీలక మైలురాయి

Mithali Raj becomes leading run scorer in Women cricket: మహిళల క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరిన మూడో వన్డేలో వ్యక్తిగత స్కోరు 15 పరుగులకు చేరగానే సువర్ణాధ్యాయం మొదలైంది. అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ నిలిచింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 4, 2021, 12:51 PM IST
  • భారత మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన
  • మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్
  • ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో భాగంగా కీలక ఇన్నింగ్స్ ఆడిన మిథాలీ రాజ్
Mithali Raj Records: టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనత, మహిళల క్రికెట్‌లో కీలక మైలురాయి

సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న టీమిండియా స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ మరో మైలురాయి చేరుకుంది. మహిళల క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను తన ఖాతాలో (Mithali Raj leading Run scorer in Women cricket) వేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరిన మూడో వన్డేలో వ్యక్తిగత స్కోరు 15 పరుగులకు చేరగానే సువర్ణాధ్యాయం మొదలైంది.

మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ నిలిచింది. హైదరాబాదీ మిథాలీరాజ్ (Mithali Raj) అంతర్జాతీయ క్రికెట్ మూడు ఫార్మాట్‌లలో కలిపి 10,337 పరుగులు చేసింది. గతంలో ఈ రికార్డు ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్‌ (10,273 పరుగులు) పేరిట ఉండేది. తాజాగా మిథాలీ ఈ రికార్డును అధిగమించింది. వొర్సెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 15 పరుగుల వ్యక్తిగత స్కోరుకు చేరుకోగానే మిథాలీ రాజ్ అరుదైన సాధించింది. మహిళల క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచింది. మరిన్న విజయాలు సాధించాలని తాపత్రయ పడుతున్నానని కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొన్నారు.

Also Read: Youngest Chess Grandmaster: అభిమన్యు మిశ్రా, 12 ఏళ్ల చిచ్చరపిడుగు అరుదైన ఘనత

ఈ మ్యాచ్‌లో 220 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ (Team India)కు కెప్టెన్ మిథాలీ రాజ్ (75 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌తో విజయాన్ని అందుకుంది. మిథాలీ రాజ్ 11 టెస్టుల్లో 669 పరుగులు చేయగా, 217 వన్డేల్లో 7,304 సాధించింది. 89 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో 2,364 పరుగులు పూర్తి చేసుకుంది. న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్ 7849 పరుగులు, వెస్టిండీస్‌ ప్లేయర్ స్టెఫానీ టేలర్ 7834 పరుగులు, ఆస్ట్రేలియా కెప్టెన్ మెక్ లానింగ్ 199 మ్యాచ్‌లలో 7,024 పరుగులతో టాప్ 5లో ఉన్నారు.

Also Read: Sri Lanka Cricketers Contract Issue: టీమిండియాతో సిరీస్, శ్రీలంక బోర్డు కాంట్రాక్టుకు సంతకం చేయని క్రికెటర్లు, కొనసాగుతున్న సస్పెన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News