Root - Sachin: సచిన్‌ అత్యధిక పరుగుల రికార్డు పెద్ద కష్టమేమీ కాదు.. జో రూట్‌ సాధిస్తాడు: టేలర్

England vs New Zealand 2022: Mark Taylor, Michael Vaughan paises Joe Root. జో రూట్‌ టెస్టుల్లో సచిన్‌ అత్యధిక పరుగుల రికార్డును అధిగమిస్తాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 7, 2022, 03:04 PM IST
  • సచిన్‌ అత్యధిక పరుగుల రికార్డు పెద్ద కష్టమేమీ కాదు
  • జో రూట్‌ సాధిస్తాడు
  • 6 వేల పరుగులే కదా
Root - Sachin: సచిన్‌ అత్యధిక పరుగుల రికార్డు పెద్ద కష్టమేమీ కాదు.. జో రూట్‌ సాధిస్తాడు: టేలర్

Mark Taylor says Joe Root to break Sachin Tendulkar all-time Test record: ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా టెస్టుల్లో 10,000 పరుగల మైలురాయిని అందుకున్నాడు. లార్డ్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో రూట్‌ ఈ ఘనత సాధించాడు. దాంతో టెస్టు క్రికెట్‌ చరిత్రలో 10 వేల పరుగులు చేసిన 14వ ఆటగాడిగా రూట్‌ నిలిచాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసిన రెండో ఇంగ్లండ్  బ్యాటర్‌గానూ నిలిచాడు. రూట్ ఆటతీరును ఇంగ్లీష్ జట్టు మాజీ సారథి మైఖేల్‌ వాన్‌, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ ప్రశంసించాడు. 

జో రూట్‌ టెస్టుల్లో క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ అత్యధిక పరుగుల (15,921) రికార్డును అధిగమిస్తాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైఖేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు. 'ఇంగ్లండ్ జట్టులో జో రూట్‌ అత్యుత్తమ క్రికెటర్‌. దిగ్గజ బ్యాటర్‌ గ్రహమ్‌ గూచ్‌ సరసన రూట్ నిలుస్తాడని నేను నమ్ముతున్నా. ఇప్పుడు రూట్ ఆడుతున్న తీరును బట్టి చూస్తే.. టెస్టుల్లో క్రికెట్ దిగ్గజం సచిన్‌ అత్యధిక పరుగుల రికార్డును అధిగమిస్తాడు. సచిన్‌ కన్నా  6వేల పరుగులు తక్కువ ఉన్నాడు. రూట్ వయస్సు 31 ఏళ్లే. జేమ్స్‌ అండర్సన్‌ మాదిరి 40 ఏళ్ల వరకు క్రికెట్‌ ఆడితే..  సచిన్‌ అత్యధిక పరుగుల రికార్డును అధిగమిస్తాడు' అని అన్నాడు. 

'జో రూట్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను గత 18-24 నెలలుగా ఇలా బ్యాటింగ్ చేయడం నేనెప్పుడూ చూడలేదు. అతను తన కెరీర్‌లోనే గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. రూట్‌కు ఇంకా 5 ఏళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉంది. ఆరోగ్యంగా ఉంటే 15,000 పరుగులు చేస్తాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును రూట్ సాధించగలడని నేను భావిస్తున్నాను' అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ పేర్కొన్నాడు. రూట్‌ ఇప్పటివరకు 118 టెస్టుల్లో 10,015 పరుగులు చేశాడు. ఇందులో 26 శతకాలు, 53 అర్ధ శతకాలు ఉన్నాయి.

స్కై స్పోర్ట్స్‌తో ఇంగ్లీష్ మాజీ సారథి నాజర్ హుస్సేన్ మాట్లాడుతూ... 'జో రూట్ ఎప్పుడూ ప్రపంచ స్థాయి ఆటగాడే. అతని టెక్నిక్ చాలా బాగుంటుంది. ఆటలో మంచి లయ, పట్టును కలిగి ఉన్నాడు. అతనిలో ఇంకా పరుగులు చేసే సత్తా ఉంది. పరుగుల ప్రవాహం పారించగలడు. 10000 టెస్ట్ పరుగులు చేయడం చాలా ప్రత్యేకం. ఇంగ్లండ్ కెప్టెన్‌గా గత రెండు సంవత్సరాలుగా గడిపిన ప్రతిదానికీ అతను పూర్తిగా అర్హుడు'అని చెప్పుకొచ్చాడు. 

Also Read: Murari Vaa Video Song: మ‌హేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. 'మురారి వా' వీడియో సాంగ్ వచ్చేసింది!  

Also Read: Feng Shui Tips: ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేయాలంటే.. ఈ ఫెంగ్ షుయ్ చిట్కాలు పాటించండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News