ఐపీఎల్ 2022లో 14 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు.. ఇంతవరకూ భారత జట్టులో చోటు దక్కలేదు!

Lucknow Super Giants Fast Bowler Mohsin Khan not selected for Indian Team. ఐపీఎల్ 2022 అనంతరం ఇన్ని సిరీస్‌కు జరిగినా ఫాస్ట్ బౌలర్ మొహ్సిన్ ఖాన్‌ను ఎంపిక చేయకుండా సెలెక్టర్లు ఆశ్చర్యపరిచారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 11, 2022, 03:32 PM IST
  • ఐపీఎల్ 2022లో 14 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు
  • ఇంతవరకూ భారత జట్టులో చోటు దక్కలేదు
  • బలహీన జట్లపై కూడా బీసీసీఐ అవకాశం ఇవ్వలేదు
ఐపీఎల్ 2022లో 14 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు.. ఇంతవరకూ భారత జట్టులో చోటు దక్కలేదు!

Lucknow Super Giants Fast Bowler Mohsin Khan not selected for Indian Team: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌తో తీరిక లేని క్రికెట్ ఆడుతోంది. ఐపీఎల్ 2022 అనంతరం దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్, ఐర్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్ టూర్‌లతో బిజీబిజీగా గడిపింది. టీమిండియా ఒకేసారి రెండు జట్లతో ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లకు బీసీసీఐ సెలక్టర్లు అవకాశాలు కల్పిస్తున్నారు. దాంతో రాబోయే టీ20 ప్రపంచకప్‌ 2022 కోసం పటిష్ట జట్టును తయారు చేస్తున్నారు. అయితే యువ ఆటగాళ్లందరికీ ఆడే అవకాశాలు దాదాపుగా అందగా.. ఐపీఎల్ 2022లో అద్భుత ప్రదర్శన చేసిన ఓ ఆటగాడికి మాత్రం ఇంకా భారత జట్టులో చోటు దక్కలేదు. 

ఐపీఎల్ 2022లో భారత యువ బౌలర్ మొహ్సిన్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన మొహ్సిన్.. 9 మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేసి టాప్ అమోడెర్ వికెట్లు తీశాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన మొహ్సిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ బ్యాట్స్‌మెన్‌లకు సైతం కష్టంగా మారింది. అలాంటి బౌలర్‌కు జింబాబ్వే, ఐర్లాండ్, శ్రీలంక వంటి బలహీన జట్లపై కూడా బీసీసీఐ సెలక్టర్లు అవకాశం ఇవ్వలేదు. 

ఐపీఎల్ 2022 అనంతరం ఇన్ని సిరీస్‌కు జరిగినా ఎడమచేతి వాటం కలిగిన భారత ఫాస్ట్ బౌలర్ మొహ్సిన్ ఖాన్‌ను ఎంపిక చేయకుండా సెలెక్టర్లు ఆశ్చర్యపరిచారు. అయితే మొహ్సిన్ టీమిండియాలో చోటుకు అతిపెద్ద పోటీదారుగా ఉన్నాడు. దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ.. బంతిని స్వింగ్ చేయడంలో మొహ్సిన్ దిట్ట. మొహ్సిన్ ఫాస్ట్ బౌలింగ్ అచ్చం మాజీ భారత దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ మాదిరే ఉంటుంది. 

ఐపీఎల్‌లో 16 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం మొహ్సిన్ ఖాన్ అత్యుత్తమ ప్రదర్శన. అతని ఎకానమీ రేటు 5.93గా ఉంది. బీసీసీఐ సెలెక్టర్లు అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ వంటి బౌలర్లకు నిరంతరం అవకాశాలు ఇస్తుండగా.. మొహ్సిన్ ఖాన్‌కు ఇప్పటివరకు ఒక్క అవకాశం ఇవ్వలేదు. భారత జట్టులో చోటు కోసం మొహ్సిన్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. అవకాశం ఇవ్వకుండా ఈ యువ బౌలర్ కెరీర్‌ను బీసీసీఐ సెలెక్టర్లు నాశనం చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. 

ఆసియా కప్ 2022 కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (కీపర్), దినేష్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్.

Also Read: Sourav Ganguly Resign: బీసీసీఐ అధ్యక్ష పదవికి సౌరవ్ గంగూలీ రాజీనామా.. కొత్త ప్రెసిడెంట్ ఎవరంటే!

Also Read: ఒప్పో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేసింది.. ధర కేవలం 15 వేల రూపాయలే! అద్భుత ఫీచర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News