IND vs PAK T20I Live Updates: ఆదుకున్న హార్దిక్, జడేజా.. పాకిస్తాన్‌పై భారత్ విజయం!

IND vs PAK T20I Asia Cup 2022 Match Live Updates: ఆసియా కప్‌ 2022లో భాగంగా దుబాయ్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచులో భారత్ విజయం సాధించింది. పాక్ నిర్ధేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు ఉండగానే ఛేదించింది. 

Written by - P Sampath Kumar | Last Updated : Aug 28, 2022, 11:51 PM IST
  • IND vs PAK T20I Asia Cup 2022 Match Live Updates: India vs Pakistan Asia Cup 2022 clash Socre Card, IND vs PAK live streaming. ఆసియా కప్‌ 2022లో భాగంగా దుబాయ్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచులో భారత్ విజయం సాధించింది. పాక్ నిర్ధేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు ఉండగానే ఛేదించింది. 
IND vs PAK T20I Live Updates: ఆదుకున్న హార్దిక్, జడేజా.. పాకిస్తాన్‌పై భారత్ విజయం!
Live Blog

IND vs PAK T20I Asia Cup 2022 Match Live Updates: ఆసియా కప్‌ 2022లో భాగంగా దుబాయ్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచులో భారత్ విజయం సాధించింది. పాక్ నిర్ధేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు ఉండగానే ఛేదించింది. 

28 August, 2022

  • 23:49 PM

    ఆసియా కప్‌ 2022లో భాగంగా దుబాయ్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచులో భారత్ విజయం సాధించింది. పాక్ నిర్ధేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు ఉండగానే ఛేదించింది. రవీంద్ర జడేజా (34; 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు), హార్దిక్ పాండ్యా (33 నాటౌట్; 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) జట్టు విజయంలో కీలక పాత్ర పోచించారు. విరాట్ కోహ్లీ (35; 34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అంతకుముందు భునవేశ్వర్ కుమార్ 4, హార్దిక్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టడంతో పాక్ 147 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ బ్యాటర్లలో మహమ్మద్ రిజ్వాన్ (43) టాప్ స్కోరర్. 
     

  • 23:37 PM

    19వ ఓవర్ ముగిసేసరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (35), హార్దిక్ పాండ్యా (27) రన్స్ చేశారు. ఈ మ్యాచులో భారత్ గెలవాలంటే 6 బంతుల్లో 7 రన్స్ చేయాలి. 19వ ఓవర్లో హార్దిక్ మూడు ఫోర్లు బాదాడు. 
     

  • 23:31 PM

    18 ఓవర్లు పూర్తయ్యాయి. నసీమ్ షా వేసిన ఈ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. దీంతో భారత్‌ స్కోరు 127/4కి చేరింది. భారత్ విజయం సాధించాలంటే ఇంకా 12 బంతుల్లో 21 పరుగులు సాధించాలి. ప్రస్తుతం క్రీజ్‌లో రవీంద్ర జడేజా (34), హార్దిక్ పాండ్య (14) ఉన్నారు.

  • 23:20 PM

    పాకిస్తాన్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత్ 17వ ఓవర్ ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (24), హార్దిక్ పాండ్యా (14) పరుగుతో ఆడుతున్నారు. ఈ మ్యాచులో భారత్ గెలవాలంటే 18 బంతుల్లో 32 రన్స్ చేయాలి. 
     

  • 23:11 PM

    16 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 107/4. ప్రస్తుతం క్రీజ్‌లో రవీంద్ర జడేజా (22), హార్దిక్ పాండ్యా (11) ఉన్నారు. భారత్ గెలవాలంటే 24 బంతుల్లో 41 రన్స్ చేయాలి. 
     

  • 23:05 PM

    15వ ఓవర్ ముగిసేసరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (19), హార్దిక్ పాండ్యా (7) రన్స్ చేశారు. ఈ మ్యాచులో భారత్ గెలవాలంటే 30 బంతుల్లో 51 రన్స్ చేయాలి. 
     

  • 23:03 PM

    ఆసియా కప్‌ 2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్ (18) ఔట్ అయ్యాడు. నసీమ్ షా వేసిన 15వ ఓవర్ రెండో బంతికి బోల్డ్ అయ్యాడు. 
     

  • 22:58 PM

    14 ఓవర్‌లో ఒక్క బౌండరీ రాలేదు. షానవాజ్ దహానీ వేసిన ఈ ఓవర్‌లో కేవలం 6 పరుగులే వచ్చాయి. భారత్ స్కోరు 89/3. క్రీజ్‌లో సూర్యకుమార్‌ (18), రవీంద్ర జడేజా (18) ఉన్నారు. భారత్‌ విజయానికి 36 బంతుల్లో 59 పరుగులు కావాలి.

  • 22:49 PM

    13 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 83/3. ప్రస్తుతం క్రీజ్‌లో రవీంద్ర జడేజా (16), సూర్యకుమార్ యాదవ్ (15) ఉన్నారు. భారత్ గెలవాలంటే 42 బంతుల్లో 65 రన్స్ చేయాలి. 
     

  • 22:45 PM

    ఆసియా కప్‌ 2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 12వ ఓవర్ ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (15), సూర్యకుమార్ యాదవ్ (10) పరుగుతో ఆడుతున్నారు. ఈ మ్యాచులో భారత్ గెలవాలంటే 48 బంతుల్లో 71 రన్స్ చేయాలి. 
     

  • 22:40 PM

    11 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 69/3. ప్రస్తుతం క్రీజ్‌లో రవీంద్ర జడేజా (9), సూర్యకుమార్ యాదవ్ (8) ఉన్నారు.
     

  • 22:37 PM

    10 ఓవర్ ముగిసేసరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (8), సూర్యకుమార్ యాదవ్  (2) రన్స్ చేశారు. ఈ మ్యాచులో భారత్ గెలవాలంటే 60 బంతుల్లో 86 రన్స్ చేయాలి. 
     

  • 22:34 PM

    జడేజా భారీ సిక్స్:
    రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఔట్ అయినా.. రవీంద్ర జడేజా ఏమాత్రం బెదరకుండా భారీ సిక్స్ బాదాడు. ఏకంగా 98 మీటర్ల సిక్స్ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. 

  • 22:31 PM

    ఆసియా కప్‌ 2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ మరో కీలక వికెట్ కోల్పోయింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (35) ఔట్ అయ్యాడు.

  • 22:28 PM

    ఆసియా కప్‌ 2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 9వ ఓవర్ ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (35), రవీంద్ర జడేజా (1) పరుగుతో ఆడుతున్నారు.

  • 22:27 PM

    ఆసియా కప్‌ 2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (12) ఔట్ అయ్యాడు. దాంతో భారత్ 50 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు. 
     

  • 22:22 PM

    7 ఓవర్ ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (5), విరాట్ కోహ్లీ (31) రన్స్ చేశారు. రోహిత్‌ ఆచితూచి ఆడుతుండగా.. కోహ్లీ బ్యాట్ జుళిపిస్తునాడు. 
     

  • 22:15 PM

    6 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 38/1. ప్రస్తుతం క్రీజ్‌లో రోహిత్ శర్మ (4), విరాట్ కోహ్లీ (28) క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఓవర్‌లో కోహ్లీ ఫోర్ బాదాడు. 
     

  • 22:11 PM

    ఆసియా కప్‌ 2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 5వ ఓవర్ ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (4), విరాట్ కోహ్లీ (24) పరుగుతో ఆడుతున్నారు. ఈ మ్యాచులో భారత్ గెలవాలంటే 90 బంతుల్లో 119 రన్స్ చేయాలి. 
     

  • 22:07 PM

    4 ఓవర్ ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (3), విరాట్ కోహ్లీ (19) రన్స్ చేశారు.  భారత్ గెలవాలంటే 96 బంతుల్లో 125 రన్స్ చేయాలి. 
     

  • 22:01 PM

    3 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 15/1. ప్రస్తుతం క్రీజ్‌లో రోహిత్ శర్మ (2), విరాట్ కోహ్లీ (12) క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఓవర్‌లో నసీమ్ షా 5 రన్స్ ఇచ్చాడు. 
     

  • 21:57 PM

    పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 2వ ఓవర్ ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (1), విరాట్ కోహ్లీ (8) పరుగుతో ఆడుతున్నారు. 
     

  • 21:56 PM

    స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్‌ అయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఆఫ్‌సైడ్‌ వేసిన బంతి ఎడ్జ్‌ తీసుకుని స్లిప్‌ వైపు దూసుకెళ్లగా ఫీల్డర్‌ వదిలేశాడు. దాంతో కోహ్లీ బతికిపోయాడు. 
     

  • 21:54 PM

    మొదటి ఓవర్ ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 3 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (1), విరాట్ కోహ్లీ (1) రన్స్ చేశారు.  
     

  • 21:51 PM

    టీమిండియాకు షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్‌ (0) గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌కు చేరాడు. నసీమ్‌ షా బౌలింగ్‌లో ఆడిన తొలి బంతికి రాహుల్ క్లీన్‌ బౌల్డయ్యాడు. 
     

  • 21:34 PM

    ఆసియా కప్‌ 2022లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఆలౌట్ అయింది. భారత బౌలర్లు చెలరేగడంతో పాక్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో టీమిండియా ముందు 148 పరుగుల సాధారణ లక్ష్యం ఉంది. పాక్ బ్యాటర్లలో మహమ్మద్ రిజ్వాన్ (43) టాప్ స్కోరర్. ఇఫ్తికార్ అహ్మద్ 28 రన్స్ చేయగా.. ఇన్నింగ్స్ చివరలో షహ్నవాజ్ దహానీ 16 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో భునవేశ్వర్ కుమార్ 4, హార్దిక్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టారు.  
     

  • 21:22 PM

    టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు. షాదాబ్ ఖాన్, నసీమ్ షాలను ఔట్ చేశాడు. 
     

  • 21:17 PM

    18 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 124/7 ప్రస్తుతం క్రీజ్‌లో షాదాబ్ ఖాన్ (6), హారిస్ రవూఫ్ (10) క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఓవర్‌లో హర్షదీప్ సింగ్ 10  రన్స్ ఇచ్చాడు. 
     

  • 21:12 PM

    ఆసియా కప్‌ 2022లో భాగంగా భారత్, పాకిస్తాన్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తళుక్కుమన్నాడు. మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. 

  • 21:10 PM

    17వ ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ ఆరు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. షాదాబ్ ఖాన్ (6), మహమ్మద్ నవాజ్ (1) రన్స్ చేశారు.  
     

  • 21:09 PM

    ఆసియా కప్‌ 2022లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ మరో వికెట్ కోల్పోయింది. ఆసిఫ్ అలీ (9)ని భువీ ఔట్ చేశాడు. దాంతో పాక్ 112 పరుగుల వద్ద పాక్‌ ఆరో వికెట్‌ను కోల్పోయింది.
     

  • 21:04 PM

    16 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 111/5. ప్రస్తుతం క్రీజ్‌లో షాదాబ్ ఖాన్ (4), ఆసిఫ్ అలీ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఓవర్‌లో చహల్  కేవలం 8 పరుగులు ఇచ్చాడు. 
     

  • 21:01 PM

    టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ మరో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. మొదట బంతికి మహ్మద్ రిజ్వాన్ (43)ను ఔట్ చేసిన హార్దిక్.. మూడో బంతికి ఖుష్‌దిల్ షా (2)ను పెవిలియన్ చేర్చాడు. 15 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోర్ 103/5. షాదాబ్ ఖాన్ (2), ఆసిఫ్ అలీ (3) క్రీజ్‌లో ఉన్నారు. 

  • 20:55 PM

    ఆసియా కప్‌ 2022లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ కీలక వికెట్ కోల్పోయింది. మహ్మద్ రిజ్వాన్ (43; 42 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్)ను హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. దాంతో పాక్ 96 పరుగుల వద్ద పాక్‌ నాలుగో వికెట్‌ను కోల్పోయింది.
     

  • 20:51 PM

    టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 14వ ఓవర్ ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ (43), ఖుష్‌దిల్ షా (2) పరుగుతో ఆడుతున్నారు. 
     

  • 20:45 PM

    13 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 90/3. ప్రస్తుతం క్రీజ్‌లో మహ్మద్ రిజ్వాన్ (38), ఖుష్‌దిల్ షా (1) ఉన్నారు. ఈ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 
     

  • 20:42 PM

    టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ మూడో వికెట్ కోల్పోయింది. ఇఫ్తికర్‌ అహ్మద్ (28; 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్)ను హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. పాక్ 87 పరుగుల వద్ద పాక్‌ మూడో వికెట్‌ను కోల్పోయింది.
     

  • 20:39 PM

    టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 12వ ఓవర్ ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ (36), ఇఫ్తికర్‌ అహ్మద్ (28) పరుగుతో ఆడుతున్నారు. ఈ ఓవర్‌లో యుజ్వేంద్ర చహల్ 11 పరుగులు ఇచ్చాడు. ఇఫ్తికర్‌ సిక్స్ బాదాడు. 
     

  • 20:34 PM

    11వ ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ (35), ఇఫ్తికర్‌ అహ్మద్ (18) రన్స్ చేశారు. ఈ ఓవర్లో జడేజా 8 రన్స్ ఇచ్చాడు. మొదటి బంతికే ఫోర్ బాదినా.. మిగతా బంతులను జడ్డు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 
     

  • 20:29 PM

    10 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 68/2. ప్రస్తుతం క్రీజ్‌లో మహ్మద్ రిజ్వాన్ (29), ఇఫ్తికర్‌ అహ్మద్ (16) ఉన్నారు. ఈ ఓవర్‌లో యుజ్వేంద్ర చహల్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 

  • 20:24 PM

    9 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 63/2. ప్రస్తుతం క్రీజ్‌లో మహ్మద్ రిజ్వాన్ (26), ఇఫ్తికర్‌ అహ్మద్ (14) ఉన్నారు. 9వ ఓవర్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. రవీంద్ర జడేజా అద్భుతంగా బంతులు వేశాడు. 
     

  • 20:20 PM

    ఎనిమిదవ ఓవర్ ముగిసేసరికి పాక్ రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ (24), ఇఫ్తికర్‌ అహ్మద్ (13) రన్స్ చేశారు. ఈ ఓవర్లో చహల్ 8 రన్స్ ఇచ్చాడు. 
     

  • 20:19 PM

    టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఏడవ ఓవర్ ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ (22), ఇఫ్తికర్‌ అహ్మద్ (7) పరుగుతో ఆడుతున్నారు. 
     

  • 20:17 PM

     6 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 43/2. ప్రస్తుతం క్రీజ్‌లో మహ్మద్ రిజ్వాన్ (20), ఇఫ్తికర్‌ అహ్మద్ (1) ఉన్నారు. 6వ ఓవర్‌లో మొత్తం 13 పరుగులు వచ్చాయి.
     

  • 20:12 PM

    టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ రెండో వికెట్ కోల్పోయింది. ఫఖర్ జమాన్ (10)ను అవేశ్‌ ఖాన్‌ బోల్తా కొట్టించాడు. పాక్ 42 పరుగుల వద్ద పాక్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది.

  • 20:07 PM

    ఐదవ ఓవర్ ముగిసేసరికి పాక్ ఒక వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ (9), ఫఖర్ జమాన్ (9) రన్స్ చేశారు. ఈ ఓవర్లో హార్దిక్ పాండ్యా 7 రన్స్ ఇచ్చాడు. 
     

  • 20:03 PM

    టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ నాలుగో ఓవర్ ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ (7), ఫఖర్ జమాన్ (4) పరుగుతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో అర్ష్‌దీప్‌ సింగ్ బౌండరీ ఇచ్చాడు. 
     

  • 19:56 PM

    మూడో ఓవర్ ముగిసేసరికి పాక్ ఒక వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ (3), ఫఖర్ జమాన్ (4) రన్స్ చేశారు. 
     

Trending News