రాయల్ ఛాలెంజర్స్‌ని ఓడించిన కోల్‌కతా నైట్ రైడర్స్

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ జట్టును కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఓడించింది.

Last Updated : Apr 9, 2018, 03:06 PM IST
రాయల్ ఛాలెంజర్స్‌ని ఓడించిన కోల్‌కతా నైట్ రైడర్స్

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ జట్టును కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఓడించింది. 177 పరుగుల టార్గెట్‌ను కేవలం 18.5 ఓవర్లలోనే పూర్తి చేసింది. తొలుత ట్యాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న నైట్ రైడర్స్ కెప్టెన్ దీనేష్ కార్తీక్ ఒక ప్రణాళిక ప్రకారమే జట్టును లీడ్ చేశాడు.

రాయల్ ఛాలెంజర్స్ జట్టులో మెకల్లమ్ (43 పరుగులు), విరాట్ కోహ్లీ (31 పరుగులు), డివిల్లిర్స్ (44 పరుగులు), మన్దీప్ సింగ్ (37 పరుగులు) రాణించగా.. ఏడు వికెట్లకు గాను జట్టు 176 పరుగులు చేసింది.

ఆ తర్వాత బరిలోకి నైట్ రైడర్లలో సునీల్ నారేన్ కేవలం 19 బాల్స్‌లో 50 పరుగులు చేసి మరో రికార్డు తిరగరాశాడు. ఆ తర్వాత నితీష్ రానా (34 పరుగులు), దినేష్ కార్తిక్ (35 పరుగులు) రాణించగా.. జట్టు ఇంకా 7 బాల్స్ ఉండగానే అనుకున్న టార్గెట్ చేరుకుంది. విజేతగా నిలిచింది. 

Trending News