టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. తన 63వ టెస్టు మ్యాచ్‌లో.. టెస్ట్ సిరీస్‌లో 5000 పరుగులు పూర్తి చేసిన 11వ భారత ఆటగాడిగా వార్తల్లో నిలిచాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో .. తొలి ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసిన సమయాన... కోహ్లీ ఈ అరుదైన రికార్డు సాధించాడు. తన 105 ఇన్నింగ్స్‌లో ఆయన ఈ రికార్డు సొంతం చేసుకోవడం విశేషం.
అలాగే వేగంగా ఈ రికార్డు సాధించిన 4వ బ్యాట్స్‌మన్ కూడా కోహ్లీనే. గతంలో సునిల్ గావస్కర్ (95 ఇన్నింగ్స్‌ల్లో), వీరేంద్ర సెహ్వాగ్ (98), సచిన్ టెండూల్కర్ (103) ఈ ఘనత సాధించారు. విదేశీ క్రికెటర్లలో స్టీవ్ స్మిత్ 97 ఇన్నింగ్స్‌ల్లో, జో రూట్ 105 ఇన్నింగ్స్‌ల్లో, కేన్ విలియమ్సన్ 110 ఇన్నింగ్సుల్లో 5000 పరుగులు సాధించారు. ఏదేమైనా కోహ్లీ ఆడే ప్రతీ ఆట ఏదో ఒక రికార్డు బ్రేక్ చేయడం విశేషమే అని పొంగిపోతున్నారు ఆయన ఫ్యాన్స్.