కోహ్లీ ఖాతాలో మరో డబుల్ సెంచరీ

శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెచ్చిపోయి ఆడడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది.

Last Updated : Dec 3, 2017, 07:29 PM IST
కోహ్లీ ఖాతాలో మరో డబుల్ సెంచరీ

శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెచ్చిపోయి ఆడడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. టెస్టు్ల్లో తన ఆరో డబుల్ సెంచరీని నమోదు చేసిన కోహ్లీ, బ్రియాన్ లారా రికార్డును కూడా అధిగమించి.. సచిన్, సెహ్వాగ్ రికార్డులను సమంగా చేసి మళ్ళీ వార్తల్లో నిలిచాడు. బ్రియాన్ లారా ఇప్పటికే తన టెస్టు కెరీర్‌లో 5 డబుల్ సెంచరీలు చేశారు. ఆ తర్వాత సచిన్, సెహ్వాగ్ మాత్రమే చెరో ఆరు డబుల్ సెంచరీలు చేశారు.

శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో స్ట్రెయిట్‌ డ్రైవ్‌లు, కట్‌షాట్లతో ఆట ఆద్యంతం ప్రేక్షకులను అలరించిన కోహ్లీ బ్యాటింగ్‌కి, రోహిత్ అర్థ శతకం కూడా తోడవడంతో 536/7 వద్ద ఇన్నింగ్స్‌‌ను డిక్లేర్‌ చేసింది భారత్. ఓవర్‌నైట్‌ స్కోరు 371/4తో రెండో రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన కోహ్లీ (243; 287 బంతుల్లో 25×4) ట్రిపుల్ సెంచరీ చేసేస్తాడేమోనని చాలా మంది భావించారు. అయితే అతన్ని సండకన్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. ప్రస్తుతం 536/7 స్కోరుకు టీమిండియా ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.

Trending News