IND vs NZ: అందుకే న్యూజీలాండ్‌ను కోహ్లీ ఫాలోఆన్‌ ఆడించలేదు.. అసలు విషయం చెప్పేసిన భారత ప్లేయర్!!

రెండో టెస్ట్ మ్యాచులో న్యూజీలాండ్‌ జట్టును భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫాలోఆన్‌ ఆడించకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్ స్పందించాడు. కివీస్‌ను ఫాలోఆన్‌ ఆడించకపోవడానికి కారణం బౌలర్లకు విశ్రాంతినివ్వాలనే ఉద్దేశం మాత్రం కాదన్నాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2021, 11:44 AM IST
  • అందుకే న్యూజీలాండ్‌ను కోహ్లీ ఫాలోఆన్‌ ఆడించలేదు
  • అసలు విషయం చెప్పేసిన దినేష్ కార్తీక్
  • కివీస్‌ను ఫాలోఆన్‌ ఆడించకపోవడానికి కారణమిదే
IND vs NZ: అందుకే న్యూజీలాండ్‌ను కోహ్లీ ఫాలోఆన్‌ ఆడించలేదు.. అసలు విషయం చెప్పేసిన భారత ప్లేయర్!!

Dinesh Karthik reacts about India Didn't Impose Follow-on after NZ All Out: ముంబైలోని వాంఖడే మైదానంలో భారత్, న్యూజీలాండ్‌ (IND vs NZ) జట్ల మధ్య రెండో టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆటలో రెండో రోజైన శనివారం భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు అలాట్ కాగా.. అనంతరం కివీస్ 62 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియాకు 263 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. దాంతో కివీస్‌ను భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఫాలోఆన్‌ (Follow-on) ఆడిస్తాడని అందరూ భావించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ భారత జట్టునే బరిలోకి దింపాడు. కివీస్ జట్టును ఫాలోఆన్‌ ఆడించకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్ (Dinesh Karthik) స్పందించాడు. 

క్రిక్‌బజ్‌ ఇంటరాక్షన్‌లో దినేష్ కార్తీక్ (DK) మాట్లాడుతూ... 'కివీస్ టూర్ అనంతరం భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌ను మూడు, నాలుగు రోజుల్లో ముగించడం ద్వారా భారత్‌కు అదనపు పాయింట్లు లభించవు అని నేను భావిస్తున్నాను. అయితే ఈ పిచ్‌ మీద ఎంత ఎక్కువగా బ్యాటింగ్‌ చేస్తే.. అంత అధ్వాన్నమైన వికెట్ తయారవుతుంది. దాంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను మరోసారి తక్కువ స్కోరుకే పరిమితం చేయడం తేలికవుతుంది' అని అన్నాడు. డీకే ఇటీవలే వ్యాఖ్యాతగా కూడా మరో ఇన్నింగ్స్ ఆరంభించిన విషయం తెలిసిందే. 

Also Read: Corona cases in India: కరోనా కేసుల్లో స్వల్ప వృద్ధి- రికార్డు స్థాయిలో పెరిగిన మరణాలు

'న్యూజీలాండ్‌ జట్టును ఫాలోఆన్‌ ఆడించకపోవడం ద్వారా భారత బ్యాటర్లు ఇప్పుడు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ ఆధిక్యం ఉంది. మ్యాచ్ ఇప్పుడు మన చేతుల్లో ఉంది. అయితే ఈ పరిస్థితులను బాగా వినియోగించుకొని మరింత బాగా పుంజుకునేందుకు ఉపయోగించుకోవాలని భారత ఆటగాళ్లు చూస్తున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో చేతేశ్వర్ పుజారా మంచి ఇన్నింగ్స్ ఆడాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ చేసే అవకాశం లభిస్తే.. మంచి ఆధిక్యంతో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసే అవకాశం ఉంది. కివీస్‌ను ఫాలోఆన్‌ ఆడించకపోవడానికి కారణం బౌలర్లకు విశ్రాంతినివ్వాలనే ఉద్దేశం మాత్రం కాదు. ఇంకా మూడు రోజులు ఆట మిగిలుందనే కోహ్లీ ఫాలోఆన్‌ ఆడించలేదు' అని డీకే (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. 

Also Read: Karnataka: ఆవులు పాలివ్వట్లేదు-పితికేందుకు వెళ్తే తంతున్నాయి-పోలీసులకు రైతు ఫిర్యాదు

రెండో రోజు ఆటలో భారత్ (India) పూర్తి ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తాచాటి ఇప్పటికే మ్యాచుపై పట్టు సాధించింది. శనివారం ఆట ముగిసేసమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (38), చేతేశ్వర్ పుజారా (29) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం భారత్ 332 పరుగుల ఆధిక్యంలో ఉంది. దాదాపుగా ఈ మ్యాచ్ నాలుగో రోజు ముగిసే అవకాశాలు ఉన్నాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News