Rahul-Athiya Marriage: కేఎల్‌ రాహుల్‌-అతియా శెట్టిల వివాహం ఈ ఏడాదిలో జరగదు.. కారణం ఇదే!

Cricketer KL Rahul, Actress Athiya Shetty wedding update. కేఎల్‌ రాహుల్‌-అతియా శెట్టి పెళ్లి పీఠలెక్కబోతున్నారని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే వీరి పెళ్లి జరగదని తాజాగా సమాచారం తెలుస్తోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 19, 2022, 04:42 PM IST
  • కేఎల్‌ రాహుల్‌-అతియా శెట్టిల వివాహం జరగదు
  • అసలు కారణం ఇదే
  • ఫిట్‌నెస్‌ సాధిస్తేనే
Rahul-Athiya Marriage: కేఎల్‌ రాహుల్‌-అతియా శెట్టిల వివాహం ఈ ఏడాదిలో జరగదు.. కారణం ఇదే!

KL Rahul, Athiya Shetty wedding to postpone early 2023: టీమిండియా స్టార్‌ ఓపెనర్‌, ఐపీఎల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌.. బాలీవుడ్‌ నటి అతియా శెట్టితో డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. గత మూడేళ్ళుగా వీరిద్దరూ కలిసే తిరుగుతున్నారు. ఇరు కుటుంబాల అనుమతితో మరో మూడు నెలల్లో రాహుల్‌-అతియా పెళ్లి పీఠలెక్కబోతున్నాడని ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే వీరి పెళ్లి 2022లోనే జరగదని తాజాగా సమాచారం తెలుస్తోంది. 

కేఎల్‌ రాహుల్, అతియా శెట్టిల వివాహం 2023 ప్రారంభంలో జరగనుందని తెలుస్తోంది. 2023 జనవరి లేదా ఫిబ్రవరి మాసంలో పెళ్లి జరుగుతుందట. అయితే ఇప్పటివరకు రాహుల్‌-అతియా పెళ్లి తేదీ మరియు వేదిక ఇంకా ఖరారు కాలేదు. ముంబైలోని ఖరీదైన పాలి హిల్‌లోని సంధు ప్యాలెస్ అనే భవనంలో పెళ్లి అనంతరం అతియా, రాహుల్ నివాసం ఉండనున్నారు. దీని నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదట. ఈ ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇక్కడే వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. అందుకే 2023 ఆరంభంలో పెళ్లి జరుగుతుందని తెలుస్తోంది. 

పెళ్లి విషయమై కేఎల్ రాహుల్‌ తల్లిదండ్రులు ఇటీవలే అతియా శెట్టి తండ్రి సునీల్‌ శెట్టిని కలిశారని బాలీవుడ్‌లో ప్రచారం జరిగింది. రెండు కుటుంబాలు కలిసి రాహుల్‌-అతియా జంట పెళ్లి తర్వాత ఉండబోయే కొత్త ఇంటిని సందర్శంచారని, అక్కడే పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేయాలని వారు నిర్ణయించారట. ఇక పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ అతియానే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట. 

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఒకరోజు ముందు లోకేశ్‌ రాహుల్ గాయం బారిన పడిన పడ్డాడు. ప్రాక్టీస్ చేస్తుండగా అతనికి గజ్జలో గాయమైంది. దాంతో జర్మనీకి వెళ్లిన రాహుల్ జూన్ చివర్లో సర్జరీ కూడా చేయించుకున్నాడు. రాహుల్‌తో కలిసి జర్మనీకి అతియా శెట్టి కూడా వెళ్లారు. ప్రస్తుతం అతడు కోలుకున్నాడు. గాయం కారణంగా ఇంగ్లండ్‌ పర్యటనకు దూరంగా ఉన్న రాహుల్.. వెస్టిండీస్ టూర్‌కు ఎంపికయ్యాడు. అయితే పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తేనే తుది జట్టులో చోటు దక్కించుకోనున్నాడు.  

Also Read: King Cobra Video: మొహంపై కాటు వేయబోయిన కింగ్ కోబ్రా.. ఈ వ్యక్తి ఎలా తప్పించుకున్నాడో చుడండి! 

Also Read: iPhone 13 Pro Max: బంపరాఫర్... ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌పై రూ.48 వేల తగ్గింపు..   

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News