IPL 2024: కేకేఆర్ కు బిగ్ షాక్.. తిరగబెట్టిన శ్రేయస్ వెన్నునొప్పి.. ఐపీఎల్‌కు డౌటే..!

IPL 2024 Updates: ఐపీఎల్ 17వ సీజ‌న్‌ ప్రారంభానికి ముందే కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ ఎడిషన్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2024, 01:20 PM IST
IPL 2024: కేకేఆర్ కు బిగ్ షాక్.. తిరగబెట్టిన శ్రేయస్ వెన్నునొప్పి.. ఐపీఎల్‌కు డౌటే..!

IPL 2024-Shreyas Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ మెుదలవ్వకముందే కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌(Kolkata Knight Riders)కు పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (Shreyas Iyer) ఈ 17వ సీజ‌న్‌లో ఆడటం అనుమానమే అనిపిస్తోంది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన రంజీ ట్రోఫీ పైనల్లో మ్యాచ్ లో శ్రేయస్ అద్భుతంగా ఆడి... తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత అతడు వెన్నునొప్పితో తీవ్రంగా బాధపడ్డాడు. నాలుగో రోజు ఆటలో శ్రేయస్ మళ్లీ ఫీల్టింగ్ కు రాలేదు. ఐదో రోజు బరిలోకి దిగితాడంటే డౌటేనని నివేదికలు చెబుతున్నాయి. 

అయ్యర్ లేకపోతే కెప్టెన్ ఎవరు?
వెన్నునొప్పి తీవ్రమైతే కనుక అయ్యర్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచులకు దూరమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అతడు ఆడకపోతే కేకేఆర్ కెప్టెన్ గా నితీశ్ రానాను నియమించే ఛాన్స్ ఉంది. గతంలో కూడా రానా కోల్‌క‌తా కెప్టెన్‌గా వ్యవహారించి జట్టుకు విజయాలు అందించాడు. ఇదే వెన్నునొప్పి కారణంగా అయ్యర్ గత ఐపీఎల్ కు దూరమయ్యాడు. ఈసారి కూడా ఐపీఎల్ కు ముందు అతడి వెన్నునొప్పి మళ్లీ తిరగబెట్టింది. 

ఏడాది కాలంగా అదే నొప్పితో..
శ్రేయస్ అయ్యర్ ఏడాది కాలంగా ఈ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. దీంతో గతేడాది కొన్ని కీలకమైన టోర్నీలకు దూరమయ్యాడు. సర్జరీ చేయించుకుని మళ్లీ ఆసియాకప్ లో పునరాగమనం చేశాడు. ఆ మెగా టోర్నీలో అద్భుతంగా ఆడి వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. వరల్డ్ కప్ తర్వాత శ్రేయస్ కు మళ్లీ వెన్నునొప్పి తిరగబెట్టింది. దాంతో అతడు రంజీ ట్రోపీలో ఆడకుండా బెంగళూరులోని ఎన్సీఏలో చేరాడు. 

ఆగ్రహించిన బీసీసీఐ..
అయితే అతడు ఫిట్ గానే ఉన్నాడని.. రంజీల్లో ఆడకుండా తప్పించుకునేందుకు అతడు అబద్దం చెప్పాడని జాతీయ క్రికెట్ ఆకాడమీ వైద్య బృందం బీసీసీఐకి నివేదించింది. దీంతో ఆగ్రహించిన బీసీసీఐ అయ్యర్ పై వేటు వేస్తూ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. దీంతో షాక్ తిన్న అయ్యర్ రంజీల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. ఇందులో భాగంగానే విదర్భతో జరుగుతున్న జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై తరుపున బరిలోకి దిగి తొలి ఇన్నింగ్స్ లో ఏడు పరుగులకే ఔటయ్యాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం అదరగొట్టాడు. 95 పరుగులు చేసిన అయ్యర్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 

Also Read: IPL Winning Teams: ఐపీఎల్ టైటిల్ ఏ జట్టు ఎప్పుడెప్పుడు ఎన్ని సార్లు గెల్చుకుందో తెలుసా

ఫిట్ గా లేనప్పుడు.. ఎలా క్లియరెన్స్ ఇస్తారు?
ఈ సీజన్ లో కేకేఆర్ తన తొలి మ్యాచ్‌ని మార్చి 23న ఆడుతుంది. రాబోయే 8 రోజుల్లో అయ్యర్ ఫిటినెస్ నిరూపించుకోకపోతే ఐపీఎల్ ప్రారంభ మ్యాచులకు దూరమయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే, అయ్యర్ పూర్తిగా ఫిట్‌గా లేనప్పుడు జాతీయ క్రికెట్ అకాడమీ అతడికి రంజీ ఫైనల్ ఆడటానికి ఎలా క్లియరెన్స్ ఇచ్చిందనేది పెద్ద ప్రశ్న. ఏది ఏమైనా అతడు తిరిగి రావాలని కేకేఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. 

Also Read: ICC Test Rankings: మళ్లీ నంబర్ వన్ గా అశ్విన్.. టాప్-10లోకి దూసుకొచ్చిన రోహిత్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News