Mumbai Indians batter Kieron Pollard announces retirement from IPL: ముంబై ఇండియన్స్ సీనియర్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 13 సీజన్లలో ముంబై తరఫున ఆడిన పొలార్డ్ మంగళవారం (నవంబర్ 15)న భారత టీ20 లీగ్‌కు వీడ్కోలు పలికాడు. అయితే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా కొత్త పాత్రలో పొలార్డ్ ముంబై ఫ్యామిలీతోనే అతడు కొనసాగుతాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌తో ఆడేందుకు పొలార్డ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
వెస్టిండీస్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ 2010లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముంబై 5 ఐపీఎల్ ట్రోఫీలు మరియు 2 ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలు గెలవడంతో తన వంతు కృషి చేశాడు. సుమారు పదేళ్లుగా ముంబై ఇండియన్స్‌తో కలిసి ఉన్న హిట్టర్ కీరన్ పొలార్డ్‌ను వదులుకోవడంతో ఆ జట్టు ఫాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌లో ఆడనున్నాడని తెలిసి ఆనందపడుతున్నారు.
'ఇది సులభమైన నిర్ణయం కాదు. నేను మరికొన్ని సంవత్సరాలు ముంబై ఇండియన్స్‌తో ఆడాలని భావించా. కానీ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్‌తో చర్చల అనంతరం నా నిర్ణయం మార్చుకున్నా. నేను ఇకపై ముంబై కోసం ఆడను అంటే.. ముంబైకి వ్యతిరేకంగా ఆడుతానని కాదు. అది కలలో కూడా నేను ఊహించలేను. నా ప్రయాణం ఎప్పుడూ ముంబైతోనే. ఇది ముంబైకి భావోద్వేగ వీడ్కోలు కాదు. ఐపీఎల్‌లో బ్యాటింగ్ కోచ్ పాత్రను చేపట్టేందుకు, ఎంఐ ఎమిరేట్స్‌తో ఆడేందుకు నేను అంగీకరించాను. నా కెరీర్లో ఈ తదుపరి అధ్యాయంను ఎనోయ్ చేస్తానని భావిస్తున్నా' అని కీరన్ పొలార్డ్ పేర్కొన్నాడు.
'గత 13 సీజన్లలో ఐపీఎల్ టోర్నీలో అతిపెద్ద మరియు అత్యంత విజయవంతమైన జట్టుకు ప్రాతినిధ్యం వహించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అదే సమయంలో గౌరవంగా భావిస్తున్నాను. ఈ అద్భుతమైన జట్టు కోసం ఆడాలనేది ఎల్లప్పుడూ కోరుకుంటూనే ఉంటా. ఓ ఆటగాడిగా ఐపీఎల్ సందడిని కోల్పోతాను. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో ఆడినందుకు నేను అదృష్టవంతుడిని. ఫీల్డ్‌లో మరియు వెలుపల అభిమానుల మద్దతును నేను ఎల్లప్పుడూ మర్చిపోను. 2011, 2013లో ఛాంపియన్స్ లీగ్ మరియు 2013, 2015, 2017, 2019, 2020లో ముంబై తరఫున ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నందుకు ఆనందంగా ఉంది' అని పొలార్డ్ చెప్పాడు.
Also Read: Aamir khan big break : సినిమాలకు ఆమీర్ ఖాన్ బిగ్ బ్రేక్.. ఎందుకో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook