Jasprit Bumrah: టెస్టుల్లో సరికొత్త రికార్డు సృష్టించిన బుమ్రా.. తొలి భారత బౌలర్‌గా!!

భారత్‌ తరఫున విదేశాల్లో అత్యంత వేగంగా 100 టెస్టు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా జస్ప్రీత్  బుమ్రా రికార్డుల్లో నిలిచాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 01:44 PM IST
  • టెస్టుల్లో సరికొత్త రికార్డు సృష్టించిన బుమ్రా
  • తొలి భారత బౌలర్‌గా బుమ్రా రికార్డు
  • ఆరో భారత పేసర్‌గా కూడా బుమ్రా రికార్డు
Jasprit Bumrah: టెస్టుల్లో సరికొత్త రికార్డు సృష్టించిన బుమ్రా.. తొలి భారత బౌలర్‌గా!!

Jasprit Bumrah reaches 100-wicket milestone away from home: భారత స్టార్‌ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. టెస్ట్‌ క్రికెట్‌లో సరికొత్త రికార్డును సృష్టించాడు. భారత్‌ (India)తరఫున విదేశాల్లో అత్యంత వేగంగా 100 టెస్టు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. మూడు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా సెంచూరియాన్‌ వేదికగా దక్షిణాఫ్రికా (South Africa)తో జరుగుతున్న తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో వాన్ డెర్ డస్సెన్‌ (Rassie van der Dussen)ని ఔట్‌ చేసిన బుమ్రా ఈ ఘనత అందుకున్నాడు. ఈ రికార్డును బుమ్రా కేవలం 43 ఇన్నింగ్స్‌లోనే చేరుకున్నాడు. ఇప్పటివరకు 25 టెస్ట్‌లు ఆడిన బుమ్రా 105 వికెట్లు పడగొట్టాడు. ఈ 105 వికెట్లలో 101 వికెట్లు విదేశాల్లో తీసినవే కావడం విశేషం.

ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దూసుకుపోతున్న జస్ప్రీత్ బుమ్రా.. 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టుల్లో భారత్ తరఫున అరంగేట్రం చేసాడు. 28 ఏళ్ల బుమ్రా టెస్టుల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు (100 Wickets) తీసిన భారత ఫాస్ట్ బౌలర్ కూడా. కేవలం 24 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు. బుమ్రా తన కెరీర్‌లో ఇప్పటివరకు 25 టెస్టులు ఆడగా.. 105 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక ఇన్నింగ్స్‌లో 6 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. 25 టెస్టులలో 2 మాత్రమే స్వదేశంలో ఆడాడు. స్వదేశంలో బుమ్రా నాలుగు వికెట్లు తీశాడు. 

Also Read: LPG Cylinder Price: సామాన్య ప్రజలకు భారీ షాక్.. జనవరి 1న గ్యాస్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం!!

జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ గడ్డపై 8 టెస్టుల్లో 32 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. ఆస్ట్రేలియాలో 7 టెస్టులు ఆడి 32 వికెట్లు తీశాడు. ఒకేసారి ఐదు వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికాలో నాలుగు టెస్టులు ఆడిన బుమ్రా.. 18 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్‌లో రెండు మ్యాచులు ఆడి 13, న్యూజీలాండ్ గడ్డపై 2 మ్యాచులు ఆడి 6 వికెట్లు తీశాడు. ఇక భారత దేశంలో రెండు టెస్టులు ఆడి నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 

Also Read: Krithi Shetty on Liplock: 'కథ డిమాండ్ చేస్తే ఏం చేయడానికైనా సిద్ధమే'.. కృతి శెట్టి షాకింగ్ కామెంట్స్!

విదేశాల్లో 100 వికెట్లు పడగొట్టిన ఆరో భారత పేసర్‌గా కూడా జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) నిలిచాడు. కపిల్ దేవ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ మరియు జవగల్ శ్రీనాథ్‌లు బుమ్రా కంటే ముందున్నారు. విదేశీ గడ్డపై మాజీ పేసర్ జహీర్ ఖాన్ 137 వికెట్లు పడగొట్టాడు. త్వరలోనే జహీర్ రికార్డును బుమ్రా బద్దలు కొట్టే అవకాశం ఉంది. బుమ్రా భారత్ (Team India) తరఫున ఇప్పటివరకు 25 టెస్టులు, 67 వన్డేలు, 55 టీ20లు ఆడాడు. ఇక ఐపీఎల్ టోర్నీలో 106 మ్యాచులు ఆడాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News