37 ఏళ్ల తరువాత కప్ గెలిచిన జపాన్

37 ఏళ్ల తరువాత జపాన్ మహిళా జట్టు ఉబర్‌ కప్‌ను తిరిగి దక్కించుకుంది.

Last Updated : May 27, 2018, 05:08 PM IST
37 ఏళ్ల తరువాత కప్ గెలిచిన జపాన్

37 ఏళ్ల తరువాత జపాన్ మహిళా జట్టు ఉబర్‌ కప్‌ను తిరిగి దక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో జపాన్‌ మహిళా జట్టు థాయిలాండ్ జట్టును 3-0 తేడాతో ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. అగ్రశ్రేణి ఆటగాళ్లతో కూడిన జపాన్‌ బ్యాడ్మింటన్‌ జట్టు రెండు సింగిల్స్‌, డబుల్స్‌ మ్యాచుల్లో గెలిచింది. ఫైనల్లో తేలికగా గెలిచిన జపాన్‌ సెమీస్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చైనాతో పోరాడి ఫైనల్లోకి ప్రవేశించింది.

1981లో ఉబెర్‌ కప్‌ను గెలుచుకున్న జపాన్‌ తిరిగి కప్‌ను దక్కించుకోవడానికి 37 ఏళ్లు పట్టింది. ఫైనల్లో భాగంగా ఆడిన తొలి సింగిల్స్‌లో వరల్డ్‌ నెంబర్‌ 2 అకానే యమగుచి 21-15, 21-19 తేడాతో ప్రపంచ నెంబర్‌ 4 క్రీడాకారిణి, థాయ్‌లాండ్‌ షట్లర్‌ రాట్చనాక్‌ ఇంటానన్‌ను ఓడించింది. డబుల్స్‌లో యుకి ఫుకుషిమ, సాయాకా హిరోటా జోడీ 21-18, 21-12 తేడాతో థాయ్‌లాండ్‌ జోడీపై గెలిచింది.

మూడో సింగిల్స్‌లో నొజోమి ఒకురా థాయ్‌లాండ్‌ షట్లర్‌ నిట్చావోన్‌ జిందాపోల్‌ను 21-12, 21-9 తేడాతో ఓడించింది. '37 ఏళ్ల క్రితం జపాన్‌ బ్యాడ్మింటన్‌ జట్టు అత్యంత శక్తివంతంగా ఉండేది. మళ్లీ ఆ శక్తిని పొంది కప్‌ను సాధించడం మాకు సంతోషంగా ఉంది ’ అని ఒకుహరా అంది. ఉబర్‌కప్ విజేతగా నిలువడంతో సింగిల్స్‌లో జపాన్ నంబర్‌వన్ షట్లర్, ప్రపంచ నంబర్ 2 ర్యాంకర్ అకానే యమగుచి ఆనందం వ్యక్తం చేసింది.

Trending News