డైలమాలో సెలక్టర్లు; విండీస్ పర్యటనకు ధోనీకి ఛాన్స్ దక్కేనా ?

విండీస్ పర్యటనకు భారత జట్టును ఎంపిక చేసే విషయంలో సెలక్టర్లు కసరత్తు మొదలెట్టారు.

Last Updated : Jul 17, 2019, 10:30 PM IST
డైలమాలో సెలక్టర్లు; విండీస్ పర్యటనకు ధోనీకి ఛాన్స్ దక్కేనా ?

మరి కొన్ని రోజుల్లో  టీమిండియా విండీస్ పర్యటనకు వెళ్తోంది. వరల్డ్ కప్ మూడ్ నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న కోహ్లీసేన..మెల్లగా విండీస్ పర్యటనపై దృష్టి సారిస్తోంది. కరేబియన్ దీవుల పర్యటనకు వెళ్లే భారత జట్టును ఈ నెల 19న ఎంపిక చేస్తున్నారు. కాగా  ఆగస్టు 3 నుంచి  పరిమిత ఓవర్ల పోరు ప్రారంభమౌతుంది.  ఈ పర్యటనలో సీనియర్లను పక్కన పెట్టి యువకులను ఛాన్స్ ఇచ్చే అవకాశమున్నట్లు టాక్. ఇదే జరిగితే వేటు పడే సీనియర్లలో ముందు వరసలో కనిపించేది ధోనీ మాత్రమే. దీంతో ధోనీకి అవకాశం ఇస్తారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. 
ధోనీ స్థానంలో రిషబ్ పంత్ !!
యువకులకు ఛాన్స్ ఇచ్చి వచ్చే ప్రపంచకప్ నాటికి టీమిండియాను మరింత బలమైన జట్టుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో బీసీసీఐ సెలక్టర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో వయసు మీదపడిన ధోనీకి ఛాన్స్ ఇచ్చే విషయంలో సెలక్టర్లు డైలామాలో ఉన్నట్లు తెలిసింది. సెలక్టర్లు భవిష్యత్తు అవసరాలపై దృష్టి సారించినట్లయితే ధోనీకి ఛాన్స్ ఉండకపోవచ్చని క్రీడావిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక వేళలో ధోనిని పక్కన పెడితే కనుక దూకుడుగా ఆడుతున్న వికెట్‌కీపర్‌గా రిషభ్‌ పంత్‌ ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశముంది.

అది ధోనియే చెప్పాలి  !!
ప్రపంచకప్‌లో ధోనీ అద్భుత ప్రదర్శన చేయకపోయినప్పటికీ.. జట్టుకు అవసరమైన సమయంలో మెరుగైన ప్రదర్శన ఇచ్చాడనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కారణాలు ఏమున్నప్పటికీ ధోనీకి పక్కనపెడితే గనుక సెలక్టర్లు దానికి కచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కెప్టెన్ కోహ్లీ అండగా మెండుగా ఉన్న ధోనీని సెలక్టర్లు  పక్కన పెట్టే సాహసం చేయకపోవచ్చనే టాక్ ఉంది. ధోనీ గురించి ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ ప్రపంచకప్‌లో ధోనీ మెరుగైన ప్రదర్శనే చేశాడు. తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం అతడే అంటూ బదులిచ్చాడు. అంటే ధోనీ స్వయంగా తప్పుకుంటే తప్పితే అతన్ని పక్కన పెట్టే ఉద్దేశం లేదనే సంకేతాలు ఇచ్చారు. మరి విండీస్ పర్యటన విషయంలో ధోనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది వేచి చూడాల్సిందే మరి..

 

Trending News